Leading News Portal in Telugu

Chiranjeevi: వరుణ్ లవ్ గురించి నాకు చెప్పలేదు.. చాలా కోపంగా ఉంది



Varu

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ మహా వృక్షాన్ని పట్టుకొని వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ ఒకడు. మెగా ప్రిన్స్ గా ముకుంద అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక మొదటి సినిమా నుంచి రొటీన్ లవ్ స్టోరీస్, యాక్షన్ కాకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే వరుణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ సరసన మానుషీ చిల్లర్ నటించింది. మార్చి 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన మేకర్స్ నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ గెస్ట్ గా విచ్చేశారు. మొదటి నుంచి చిరు గురించి.. చిరుతో మెగా హీరోలకు ఉండే బాండింగ్ గురించి అందరికి తెల్సిందే. వరుణ్ కూడా ఎన్నోసార్లు తన తండ్రి నాగబాబు కంటే చిరంజీవినే ఎక్కువ ఇష్టం అని చెప్పుకొచ్చాడు. అయితే అంత ఇష్టమున్న కూడా.. వరుణ్ తన ప్రేమను చిరుకు చెప్పలేదట. ఈ విషయాన్నీ యాంకర్ సుమ ఈ ఈవెంట్ లో బయటపెట్టింది.

చిరు లీక్స్ ద్వారా సినిమాలు విషయాలు బయటపెడతారు.. కానీ, ఎప్పుడు కూడా వరుణ్- లావణ్య ప్రేమ విషయం చెప్పలేదు ఏంటి సర్ అని చిరును ప్రశ్నించగా.. దానికి చిరు సమాధానమిస్తూ.. ” ఈ ఒక్క విషయమే నాకు చెప్పలేదు.. నాకు ప్రతిదీ చెప్తాడు. తన ప్రేమ విషయం మాత్రమే చెప్పలేదు. నన్ను చూసి అన్ని విషయాల్లో ఇన్స్పిరేషన్ అని చెప్తాడుకదా.. లీక్స్ విషయంలో కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ విషయం చెప్పొచ్చు కదా . వాళ్ళ నాన్నతో చెప్పుకోలేనివి కూడా నాకు చెప్పుకుంటాడు. ఈ విషయంలో మాత్రం వరుణ్ పై కోపంగా ఉన్నాను” అని చిరు చెప్పగా.. అందుకు వరుణ్.. ” గౌరవంతో కూడిన భయం వలన చెప్పలేదు.. కానీ, లావణ్య గురించి మొదట చెప్పింది మాత్రం చిరంజీవిగారికే” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.