Leading News Portal in Telugu

Mission Chapter 1 : ఓటీటీలోకి వచ్చేస్తున్న అమీ జాక్సన్ రీఎంట్రీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?



Whatsapp Image 2024 02 26 At 10.00.32 Am

బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రామ్‌చరణ్ ఎవడు మూవీలో గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ భామ తన ప్రేమ వ్యవహారంతో పాటు తల్లిగా మారిన అమీజాక్సన్ ఆరేళ్ల పాటు సినిమాలకు దూరమైంది.హీరోయిన్‌గా అమీ జాక్సన్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన కోలీవుడ్ మూవీ మిషన్ చాఫ్టర్ వన్‌తో లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ యాక్షన్ మూవీలో అరుణ్ విజయ్ హీరోగా నటించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది.తమిళంతో పాటు తెలుగులో కూడా సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అనుకున్నారు. కానీ తెలుగులో సంక్రాంతికి నాలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ కావడంతో థియేటర్ల సమస్య కారణంగా మిషన్ చాఫ్టర్ వన్ కేవలం తమిళంలో మాత్రమే రిలీజైంది. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మిషన్ ఛాప్టర్ వన్ మూవీని నిర్మించింది.

ఇదిలా ఉంటే మిషన్ ఛాప్టర్ వన్ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. మార్చి 1న ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగులోనూ నెట్‌ఫ్లిక్స్‌లో మిషన్ ఛాప్టర్ వన్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.తెలుగులో ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. తమిళ వెర్షన్ రిలీజైన వారం రోజుల తర్వాత తెలుగులో రిలీజ్ చేయాలని అయితే అనుకున్నారు. కానీ తమిళ వెర్షన్ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలవడంతో తెలుగు రిలీజ్‌పై ఎఫెక్ట్ పడింది. దాంతో నేరుగా మిషన్ ఛాప్టర్ వన్ తెలుగు వెర్షన్ ఓటీటీలోకే రాబోతోంది.తండ్రి కూతుళ్ల ఎమోషన్‌కు యాక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు ఏఎల్ విజయ్ మిషన్ ఛాప్టర్ 1 మూవీను తెరకెక్కించాడు. హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతోన్న తన కూతురుని కలుసుకోవడానికి జైలులో ఉన్న ఖైదీ ఎలాంటి పోరాటం చేశాడు.. విదేశీ జైలులో అతడు ఖైదీగా మారడానికి కారణం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ. ఇందులో అమీజాక్సన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. ఈ సినిమాలో అమీజాక్సన్‌తో పాటు నిమిషా సజయన్ మరో హీరోయిన్‌గా కనిపించింది.