
Yevam Movie Title Logo Launched: కలర్ ఫోటో, గామి చిత్రాల ఫేమ్ చాందినీ చౌదరి, కేజీఫ్ & నారప్ప ఫేమ్ వశిష్ట, నూతన నటుడు భరత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ముఖ్యపాత్రల్లో, ప్రకాష్ దంతులూరి దర్శత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. నవదీప్ – పవన్ గోపరాజు స్థాపించిన C-Space నిర్మాణంలో నిర్మించినబడిన ఈ సినిమాకి “యేవమ్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఫిబ్రవరి 25 నుంచి మొదలు పెట్టారు మేకర్స్. ప్రసిద్ధ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలె చేత ప్రత్యేకంగా చేయించిన టైటిల్ లోగోను రొటీన్ గా సినీ తారల ద్వారా కాకుండా చిత్రకారుడి చేత ఆవిష్కరించబడటం ఒక వినూత్న ప్రయత్నం అని సినిమా టీం చెబుతోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ పోస్టర్ షేర్ చేసిన వెంటనే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని, చాందినీ నటన హైలైట్ అని మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమాకి సంగీతం నీలేష్ మండాలపు, కీర్తన శేష్ అందించగా సినిమాటోగ్రఫర్ గా విశ్వేశ్వర్ SV వ్యవహరించారు. ఇక ఎడిటర్ గా సృజన అడుసుమిల్లి వ్యవహరించగా, ప్రొడక్షన్ డిజైనర్ గా లక్ష్మణ్ ఏలే పని చేశారు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న చాందినీ చౌదరి ఆ తరువాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
View this post on Instagram