
4 Intresting Movies to Release in span of one month at Summer: సంక్రాంతి సీజన్ అయిపోయింది, ఇక తెలుగు సినీ నిర్మాతలు ఎంతో ఆసక్తిరంగా ఎదురుచూసే మరో సీజన్ సమ్మర్. అయితే ఈ ఏడాది సమ్మర్ సీజన్ కాస్త నిరాశాజనకంగా అనిపిస్తుందేమో అనేలా కనిపించింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి రివర్స్ అయింది. అదేమంటే తాజగా అందుతున్న సమాచారం మేరకు ఈ ఏడాది సమ్మర్ టైంకి నాలుగు ఆసక్తికర సినిమాలు రెడీ అయ్యాయి. వాటిలో ముందుగా దిగుతోంది ‘ఓం భీమ్ బుష్’. శ్రీ విష్ణు హీరోగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో కలిసి చేసిన ఈ సినిమాను హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మార్చ్ 22న రిలీజ్ అవుతోంది. ఇక ఆ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ కానుంది.
Prasanth Neel: ఆయనలా సినిమాలు ఎవరు తీయలేరు.. సలార్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్
‘డీజే టిల్లు’కు ఈ సినిమా సీక్వెల్. ‘టిల్లు స్క్వేర్’ మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో నటించింది. ఇక అనంతరం విజయ్ దేవరకొండ తన 13వ సినిమాగా చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురాం దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయ్. ‘ఫ్యామిలీ స్టార్’ మూవీని ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఇదే రోజు రావాల్సిన దేవర దసరాకి అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. ఇక మరో వారానికి గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా రిలీజ్ అవుతోంది. అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక అలా వారం వారం గ్యాప్ తో ఈ సినిమాలు అన్నీ రిలీజ్ కానున్నాయి.