Leading News Portal in Telugu

Sheeva Rana: పోకిరి లో గిల్లితే గిల్లించుకోవాలి భామ గుర్తుందా.. ఇప్పుడు చూడండి ఎలా ఉందో.. ?



Sheeva

Sheeva Rana: పోకిరి సినిమా గుర్తుందా.. ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతూనే ఆడే పండుగాడు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు మర్చిపోవడం చాలా కష్టం. మహేష్ బాబు నటన, పూరి డైలాగ్స్.. ఇలియానా అందం, బ్రహ్మీ- ఆలీ కామెడీ.. వేరే లెవెల్ సినిమా అంటే అతిశయోక్తి కాదు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు.. స్టార్స్ గా మారారు. ఇక ఈ సినిమాలో ప్రకాశ్‌ రాజ్‌ గ్యాంగ్‌లో ఓ రౌడీ అమ్మాయి ఉంటుంది. మహేష్ బాబు వెంటపడుతూ.. రెచ్చగొడుతూ ఉంటుంది. మహేష్.. అస్సలు ఆమెను పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు. ఇక ప్రకాష్ రాజ్ వచ్చినప్పుడు అతడితో సరసాలు ఆడుతూ ఉంటుంది. అదేనండీ.. పబ్ లో ప్రకాష్ రాజ్ ఒళ్ళో కూర్చొని గిల్లితే.. అబ్బా అని అరిస్తే.. గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు అని అంటాడు కదా.. హా ఆ అమ్మాయే శివ రాణా.

చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. పోకిరితో మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత అవకాశాలు వచ్చినా.. అంతగా పేరు అయితే రాలేదు. దీంతో శివ.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి.. తనకు వచ్చిన, నచ్చిన పని చేసుకుంటుంది. ప్రస్తుతం శివ.. యోగా టీచర్ గా కొనసాగుతోంది. ఆమెకు పెద్ద పెద్ద స్టార్ క్లయింట్స్ కూడా ఉన్నారు. సినిమాలో లేకపోయినా.. సోషల్ మీడియాలో నిత్యం శివ కనిపిస్తూనే ఉంటుంది. ఇక యోగా టీచర్ కాబట్టి.. అప్పుడు ఎంత హాట్ గా ఉందో ఇప్పుడు కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నదాని సోషల్ మీడియా పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పుడైనా సినిమాలు వస్తే ఈ చిన్నది చేస్తాను అంటోంది. మరి ముందు ముందు ఈ బ్యూటీ ఏదైనా సినిమాలో కనిపిస్తుందేమో చూడాలి.