Leading News Portal in Telugu

Viral Video: స్టార్ క్రికెటర్స్ గురించి అదిరిపోయే డైలాగులు చెప్పిన బాలయ్య..



Ipl Balayyaaa

బాలయ్య ముక్కు సూటి మనిషి.. మనసులో ఎదనిపిస్తే అది చెప్పేస్తారు.. ఆయన సినిమాల్లో ఎంత గంభీరంగా ఉంటారో.. బయట అంత సరదాగా ఉంటారు.. జోకులు వేస్తారు.. తాజాగా స్టార్ క్రికెటర్స్ గురించి అదిరిపోయే డైలాగులు చెప్పారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

వచ్చే నెల 22 నుంచి ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ పేరు వినగానే గుర్తుకు వచ్చే డైలాగులు ఏవంటూ యాంకర్ అడిగిన ప్రశ్నలకు బాలయ్య సమాధానం చెప్పారు.. ఆయన సినిమాల్లోని పవర్ ఫుల్ డైలాగులను అంకితం చేశారు..

ఆయన సినిమాల్లో డైలాగులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు.. మనం ఎంతో అభిమానించే స్టార్ క్రికెటర్స్ కు తన డైలాగులు డెడికెట్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి.. ధోనికి, కోహ్లీకి, రోహిత్ శర్మ కు తన డైలాగులు అంకితం చేశారు.. అంతేకాదు తానే స్వయంగా చెప్పడంతో ఆ వీడియో ట్రెండ్ అవుతుంది.. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్న బాలయ్య క్రీడా కార్యక్రమాలకూ హాజరు అవుతూ సందడి చేస్తారు..