
కామాక్షి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. శివ ప్రసాద్ రెడ్డి తనయుడు కైలాష్ రెడ్డి వివాహ వేడుకకు తారలు తరలి వచ్చారు. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అమల వంటి తదితర స్టార్స్ హాజరు అయ్యారు. కామాక్షి మూవీస్ తో ప్రత్యేకం అనుబంధం ఉండటంతో. నాగార్జున తన ఫ్యామిలీ తో ఈ వివాహ వేడుకకు హాజరు అయ్యారు. కామాక్షి మూవీస్ బ్యానర్ లో నాగార్జున చాలా సినిమాలు చేసారు. అలాగే ఈ వివాహ వేడుకలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సింపుల్ గా కనిపించారు. వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్స్ లో కూల్ లుక్ లో రాంచరణ్ కనిపించారు.
ప్రస్తుతం రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ మూవీని ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. అలాగే శంకర్ మూవీ తరువాత రాంచరణ్ తన తరువాత మూవీని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్నాడు.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే ఈ వివాహ వేడుకలో అఖిల్ అక్కినేని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. గుబురు గడ్డంతో స్టైలిష్ లుక్ లో కనిపించారు.గత ఏడాది ఏజెంట్ సినిమాతో అఖిల్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నారు. దీనితో ఈ సారి అదిరిపోయే సినిమాతో ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నాడు.అయితే అఖిల్ తరువాత సినిమా గురించి ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు.. కానీ తన తరువాత సినిమా మాత్రం కచ్చితంగా ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉండేలా చూస్తున్నట్లుసమాచారం.
Video: Nag, Akhil Akkineni, Chaitu , Ram Charan at producer Shiva Prasad reddy son's wedding pic.twitter.com/gNSeGNHbCX
— Telugu360 (@Telugu360) February 29, 2024