Leading News Portal in Telugu

Operation Valentine Twitter Review: గూస్ బంప్స్ గ్యారెంటీ.. సినిమా ఎలా ఉందంటే?



Ov

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’.. ఈరోజు గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది.. ఈ సినిమాకు ముందు నుంచే మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. కాగా, ఈ సినిమా స్పెషల్ షోను నేవి ఆఫీసర్స్ కోసం ఒకరోజు ముందే స్పెషల్ షో వేశారు.. పుల్వామా ఘటన, బాలాకోట్ స్ట్రైక్స్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో ‘ది బెస్ట్ ఫిల్మ్ ఆపరేషన్ వాలెంటైన్’ అని వైమానిక దళం అధికారులు తమ చిత్ర బృందాన్ని ప్రశంసించారని వరుణ్ తేజ్ తెలిపారు.. ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. ట్విట్టర్ లో సినిమా కు ఎలా రెస్పాన్స్ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆపరేషన్ వాలెంటైన్’ పర్ఫెక్ట్ ఏరియల్ కాంబాట్ ఫిల్మ్ అని ప్రముఖులు పేర్కొన్నారు. సినిమా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయని చెబుతున్నారు.. ఈ సినిమాకు మెయిన్ సీన్స్ ఎలా హైలెట్ అయ్యాయో.. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ జనాలను కట్టి పడేస్తుంది.. అలాగే ప్రతి సీన్ కూడా అద్భుతంగా ఉందనే టాక్ ను అందుకుంది..

సినిమాలో పుల్వామా ఘటన సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించేలా ఉన్నాయట. చూసిన తర్వాత ప్రేక్షకుల గుండె బరువు ఎక్కడం ఖాయమట. ఎమోషనల్ సీన్స్ హైలైట్ అవుతాయని సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పారు.. ఫస్ట్ ఆఫ్, సెకండ్ ఆఫ్, క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయని తెలుస్తుంది..

ఈ సినిమాను శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేశారు. గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ నటించారు. మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది.. మొదటి షోతోనే మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.. మొత్తానికి సూపర్ అయ్యిందనే టాక్ కూడా వినిపిస్తుంది..