
సూపర్ స్టార్ రజినికాంత్కు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.ఆయన స్టైల్ కు యాక్టింగ్ కు ఫిదా అవ్వని ప్రేక్షకుడంటూ ఎవరూ లేరు..జపాన్ లోనూ సూపర్ స్టార్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఇప్పటికి కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు తలైవా.. ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ బైక్ పై కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే ఆ బైక్ మాములు బైక్ కాదు.. 40 ఏళ్ల కిందటి బైక్. అదికూడా రజినీకాంత్ తాను నటించిన సినిమాలోని బైక్ కావడం విశేషం .విషయం ఏంటంటే ఏవీఎం నిర్మాణ సంస్థ ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించింది. దాదాపు 90 ఏళ్లుగా ఈ నిర్మాణ సంస్థ సినిమాలను తెరకెక్కిస్తోంది. 90 ఏళ్లు పురస్కరించుకుని ఏవీఎం కంపెనీ తమ బ్యానర్ లో వచ్చిన సినిమాల్లోని వాహనాలను ప్రదర్శిస్తోంది.
ఇటీవల చెన్నైలో ఏవీఎం కంపెనీ ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహించింది. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పాయుమ్ పులి సినిమను ఏవీఎం కంపెనీ నిర్మించింది.ఈ సినిమాలో రజినీకాంత్ కు జోడీగా రాధా నటించారు.ముత్తురామన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఏవీఎం నిర్మాణ సంస్థ తెరకెక్కించిన ఈ సినిమా రీసెంట్ గా 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ సినిమా లోనీ సూపర్ రజినీకాంత్ వాడిన బైక్ ను ఎగ్జిబిషన్ లో ఉంచింది. 40 ఏళ్ల క్రితం వాడిన ఆ బైక్ ను ఏవీఎం నిర్మాణ సంస్థ ఎంతో జాగ్రత్తగా మెయింటేన్ చేస్తూ వచ్చింది. తాజాగా ఈ బైక్ పై సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోజులిచ్చారు. సూపర్ స్టార్ 40 ఏళ్ల కిందటి సుజుకీ బైక్ పై కూర్చుని దిగిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ ఫోటోను సూపర్ స్టార్ అభిమానులు నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.
A treasured moment in time… one that you can relive @avmmuseum. Come visit the famed bike used by Superstar @rajinikanth in #PaayumPuli
Video conceptualisation: @_iarjun#AVMProductions #AVMStudios #SuperstarRajinikanth #Paayumpuli pic.twitter.com/XBM28TGJ6B
— AVM Productions (@avmproductions) February 29, 2024