Leading News Portal in Telugu

Aa Okkati Adakku: అల్లరి నరేష్ మూవీ మ్యూజికల్ ప్రమోషన్ షురూ.. ఫస్ట్ సింగల్ రెడీ..



Aa Okkati Adakku

అల్లరి నరేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈరోజు మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు..నాంది సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. సీరియస్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమా కూడా అదే జానర్ లో చేశారు. రీసెంట్ గా నాగార్జునతో కలిసి నా సామిరంగ సినిమా చేశాడు. సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది..

ఇప్పుడు అల్లరి నరేష్ 61 సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం ఆ ఒక్కటి అడక్కు` రూపొందుతోంది. మల్లి అంకం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి…

రీసెంట్ గా ఈరోజు సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. దాంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.. తాజాగా ఈరోజు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్.. త్వరలో విడుదలకానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. మ్యూజికల్ సంస్థ సరిగమ వేదికగా ఈ మూవీ పాటలు విడుదల కానున్నట్లు తెలిపింది. ‘మోత మోగించడానికి మేము రెడీ’ అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, వైవా హర్ష, జామీ లెవర్, అరియానా గ్లోరీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.. ఈరోజు సినిమాను మార్చి 22 నా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు..