Leading News Portal in Telugu

Varalaxmi Sarathkumar: వరలక్ష్మీకి కాబోయే భర్తకు ముందే పెళ్లయ్యింది.. ఇదిగో సాక్ష్యం..?



Varu

Varalaxmi Sarathkumar: తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదట హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టినా కూడా తనకు హీరోయిన్ పాత్రలు సూట్ కావని విలనిజాన్ని ఎంచుకుంది. ఇప్పుడున్న ఇండస్ట్రీలో కుర్ర లేడీ విలన్ గా అమ్మడు ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఒకప్పుడు కొద్దిగా బొద్దుగా ఉండే వరూ.. కష్టపడి బరువుతగ్గి నాజూగ్గా మారింది. ఇక అప్పట్లో ఈ చిన్నదాని లవ్ స్టోరీ, పెళ్లి గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. హీరో విశాల్ తో వరూ ప్రేమాయణం నడిపింది, శరత్ కుమార్ వలన వీరి పెళ్లి ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని వారు క్లారిటీ ఇచ్చేశారు. ఇక వరలక్ష్మీ.. తాను సింగిల్ గానే ఉంటాను అని, పెళ్లి చేసుకుంటే ఉపయోగం ఏది లేదని ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఆమె.. తన ఎంగేజ్ మెంట్ పిక్స్ పెట్టడం అందరిని షాక్ కు గురి చేసింది. నికోలయ్‌ సచ్ దేవ్ అనే ఆర్ట్ గ్యాలరీ ఓనర్ తో వరలక్ష్మీ నిశ్చితార్థం అత్యంత బంధుమిత్రుల సమక్షంలో జరిగింది.

ఇక వరలక్ష్మీ భర్త స్థానాన్ని సంపాదించుకొనేటప్పటికీ నికోలయ్‌ కూడా ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయాడు. దీంతో అతను ఎవరు.. ? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అలా ఆరా తీయడంతో.. నికోలయ్‌ కు అంతకుముందే పెళ్లి అయ్యినట్లు అభిమానులు వెతికి కనిపెట్టారు. నికోలయ్‌ భార్య కవిత సచ్ దేవ్. ఆమె ఒక మోడల్. ఫ్యాషన్ రంగంలో ఆమె కొనసాగుతోంది. వీరిద్దరికి విబేధాల వలన విడాకులు అయ్యినట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు.. ఏంటీ.. వరలక్ష్మీ కాబోయే భర్తకు ముందే పెళ్లయ్యిందా ..? అని నోర్లు నొక్కుకుంటున్నారు. ఇంకొంతమంది ఇప్పుడు ఇదే ఫ్యాషన్ గా మారింది. ఏదైనా వీళ్లయినా హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పుకొస్తున్నారు.