Leading News Portal in Telugu

Soumya Shetty: దోపిడీ కేసులో తెలుగు నటి అరెస్ట్.. పక్క ప్లాన్ వేసి కిలో బంగారాన్ని..



Goa

Soumya Shetty: తెలుగు నటి సౌమ్య శెట్టిని పోలీసులు చోరీ కేసులో అరెస్ట్ చేశారు. తెలుగులో ది ట్రిప్, యువర్స్ లవింగ్లీ లాంటి సినిమాల్లో నటించిన సౌమ్య.. అవకాశాలు లేక అడ్డదారి తొక్కింది. డబ్బు కోసం ఒకరితో స్నేహం చేసి.. వారి ఇంటికే కన్నం వేసింది. వివరాల్లోకి వెళితే.. సౌమ్య విశాఖ పట్నంలోని రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి కుమార్తెతో మొదట పరిచయం పెంచుకుంది. అనంతరం ఆమెతో స్నేహం ఎక్కువ అయ్యేలా చేసి ఇంటికి రాకపోకలు సాగించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల సౌమ్య.. ప్రసాద్ ఇంటికి వెళ్ళింది. ఇక అలా వెళ్లి ఇంట్లో ఎవరికి తెలియకుండా కిలో బంగారంను దొంగతనం చేసి.. గోవాకు చెక్కేసింది.

ఇక ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో ప్రసాద్.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా సౌమ్యపై అనుమానం వ్యక్తం చేయడంతో.. పోలీసులు ఆమెపై నిఘా వేశారు. ఇక అందిన బంగారంతో సౌమ్య.. గోవాలో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. ఇక ఎట్టకేలకు సౌమ్య ఆచూకీ తెలుసుకున్న పోలీసులు.. గోవా పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడ ఆమెను అరెస్ట్ చేసి వైజాగ్ కు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. చేతిలో డబ్బులు లేక, అవకాశాలు రాక.. ఆమె ఇలాంటి దారుణానికి ఒడిగట్టిందని సమాచారం. సౌమ్య శెట్టిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను రిమాండ్ కు తరలించారు.