Leading News Portal in Telugu

Vishwambhara: చిరంజీవి సినిమాలో ఐదుగురు హీరోయిన్లు.. కానీ?



Chiranjeevi

Five Heroines Acting in Megastar Chiranjeevi Vishwambhara: చివరిగా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా తర్వాత ఆయన బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. సోషల్ ఫాంటసీ సబ్జెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా ఎంపికైంది. సుమారు 4 -5 రోజుల నుంచి త్రిష- మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లోని ఒక సాంగ్ షూటింగ్ హైదరాబాద్ శివారులో ఉన్న గుంటూరు కారం మహేష్ బాబు నివాసం సెట్ లో ఘనంగా జరుగుతోంది. అయితే ఈ క్రమంలో ఈ సినిమాలో మరింత మంది హీరోయిన్లు భాగమవుతున్నారనే వార్త తెర మీదకు వచ్చింది. ఇప్పటికే త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా సురభి, ఇషా చావ్లా అలాగే తెలుగమ్మాయి రమ్య పసుపులేటి ఇద్దరూ కీలక పాత్రలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Kannappa: మంచు విష్ణు “కన్నప్ప” సాంగ్స్ కోసం ప్రభుదేవా

ఇక మిగతా ఇద్దరి సంగతి తెలియదు కానీ రమ్య అయితే మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి ఆయనతో కలిసి పని చేయడం ఒక వరంగా పేర్కొంది. అంతే కాక తనకు ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ కి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో వీరు ముగ్గురితో పాటు మరొక భామ మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. యూవి క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇప్పటికే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని డేట్స్ అనౌన్స్ చేశారు. 2025 వ సంవత్సరం ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.