
Meenakshi Chaudhary: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లక్కీ భాస్కర్. ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో దుల్కర్ లక్కీ భాస్కర్ గా కనిపించనున్నాడు. కాగా, నేడు మీనాక్షీ పుట్టినరోజు కావడంతో మేకర్స్.. ఆమె పోస్టర్ ను రిలీజ్ చేసి.. ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ చిత్రంలో మీనాక్షీ.. సుమతి అనే పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక పోస్టర్ లో సాదాచీరతో ఒక మధ్యతరగతి మహిళ.. భర్త కోసం సాయంత్రం ఇంటి గుమ్మం దగ్గర ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తుంది. సాదా చీరలో కూడా మీనాక్షీ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ సినిమాపై అభిమానులు అంచనాలను బాగా పెట్టుకున్నారు. మీనాక్షీకి ఈ చిత్రం ఎంతో ముఖ్యమని చెప్పాలి.
టాలెంట్ ఉన్న హీరోయిన్స్ లో మీనాక్షీ ఒకరు. ఈ మధ్య గుంటూరు కారం లో ఒక గెస్ట్ రోల్ చేసిన ఆమె.. అవుట్ అండ్ అవుట్ హీరోయిన్ రోల్ లో ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఇది కనుక హిట్ అయ్యింది అంటే.. అమ్మడికి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. లక్కీ భాస్కర్ భార్య.. ఎంత లక్షణంగా ఉందో అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో దుల్కర్, మీనాక్షీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.