
Dulquer Salmaan steps out from Kamal Hassan’s Thug Life: ఒక సీనియర్ స్టార్ హీరో సినిమాలో భాగమవుతున్న దుల్కర్ సల్మాన్ ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. ‘ఉలగ నాయగన్’ కమల్ హాసన్ మణి రత్నంతో కలిసి థగ్ లైఫ్ అనే యాక్షన్ డ్రామా మూవీ చేస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా చాలా రోజుల క్రితమే వచ్చింది. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం 25 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ మణి రత్నం కలిసి కాంబినేషన్ లో చేయబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. AR రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జయం రవి, త్రిష అలాగే దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Pakistan: పాక్, ఆప్ఘనిస్థాన్‌లో భారీ హిమపాతం.. 36 మంది మృతి
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మొదట అనుకున్న షెడ్యూల్ నుండి ప్రాజెక్ట్ చిత్రీకరణ వాయిదా పడిన నేపథ్యంలో దుల్కర్ డేట్ అలాట్ మెంట్ విషయంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ డేట్ సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే దుల్కర్ సల్మాన్ సినిమా నుంచి తప్పుకోవడం కొంత ఇబ్బందికర అంశమే. దానికి కారణం ఈ సినిమాలో భాగమైన తరువాత మలయాళంలో కూడా సినిమా మీద చాలా క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు డేట్స్ సెట్ కాక ఆయన బయటపడడంతో అక్కడి ప్రేక్షకులకు అసంతృప్తికి గురి చేసే అంశమే. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఇక దుల్కర్ మరోపక్క బాలకృష్ణ-బాబీ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.