Leading News Portal in Telugu

Rajamouli : విశ్వక్ సేన్ ‘గామి’ మూవీపై స్పెషల్ పోస్ట్ చేసిన రాజమౌళి..



Whatsapp Image 2024 03 06 At 8.07.17 Pm

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’. విద్యాధర్ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు., ఇప్పటివరకు మాస్ సినిమాలతో ఆకట్టుకున్న విశ్వక్ సేన్.. ఈసారి ‘గామి’తో ప్రయోగం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ మరియు ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుని సినిమాపై ఆసక్తిని పెంచేసాయి. విశ్వక్ సేన్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఈ సినిమాలో అఘోర పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ‘గామి’ ట్రైలర్ పై పలువురు సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి ‘గామి ‘ మూవీ గురించి తన ఇన్ స్టా లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.రాజమౌళి తన ఇన్ స్టా గ్రామ్ లో ‘గామి’ సినిమా గురించి పోస్ట్ చేస్తూ..” కఠోరమైన కృషి వుంటే అసాధ్యమైన కలలు కూడా సాకారమవుతాయి. ‘గామి’ సినిమా గురించి నిర్మాత కార్తీక్, దర్శకుడు విద్యాధర్ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నన్ను కలిసి నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. సినిమాలోని విజువల్స్ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు అర్థమైంది. మార్చి 8 గామి రిలీజ్ సందర్భంగా టీమ్ మొత్తానికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు.

‘గామి’ సినిమా మహా శివరాత్రి సందర్బంగా మార్చి 8న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈచిత్రానికి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని మూవీ టీం స్పెషల్ పోస్టర్ తో వెల్లడించారు. కాగా ‘గామి’ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయకపోవడంపై హీరో విశ్వక్ సేన్ స్పందించారు. “రిషబ్ శెట్టి నటించిన కాంతారా కూడా మొదట ఒక్క భాషలోనే రిలీజ్ అయింది. అక్కడ భారీ సక్సెస్ అవ్వడంతో తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నో భాషల్లో రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ‘గామి’ విషయంలో కూడా మేము అదే ఫాలో అవుతాం. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి మిగతా భాషల్లో విడుదల చేస్తాం. కచ్చితంగా ఈ మూవీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుందనే నమ్మకం ఉంది” అని విశ్వక్ తెలిపాడు