Leading News Portal in Telugu

Kannappa : మహాశివరాత్రికి సర్ప్రైసింగ్ అప్డేట్ ఇవ్వనున్న ‘కన్నప్ప’ టీం..



Whatsapp Image 2024 03 07 At 10.48.33 Pm

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవితం కథ ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది.గతంలో ఎప్పుడూ చూడని దృశ్య కావ్యంగా ఈ మూవీని తీర్చి దిద్దుతున్నారు. పీరియాడిక్ మైథలాజికల్ గా వస్తున్న ఈ సినిమాకు ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటి అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు కన్నప్పు షూటింగ్ విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు. థాయిలాండ్ లో ఫస్ట్ షెడ్యూల్ జరపుకోగా ఈ షెడ్యూల్ లో మొత్తం 600 మంది హాలీవుడ్ హాలీవుడ్ ప్రముఖులు పని చేశారు. న్యూజిలాండ్ లోని అందమైన లొకేషన్లలో ఈ సినిమాను షూట్ చేశారు. రెండో షెడ్యూల్ కోసం ఇండియాకు వస్తున్నట్లు ఇటీవల మంచు మోహన్ బాబు తెలిపారు.కాగా మంచు ఫ్యామిలీకి చెందిన మూడు జనరేషన్లతో ఈ కన్నప్ప  తెరకెక్కుతుండటం విశేషం. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఆసక్తికర అప్డేట్ ను ఇచ్చారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మహా శివరాత్రి కానుకగా.. మార్చి 08 మధ్యాహ్నం 2.55 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరో ప్రభాస్ శివుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు. నాస్తికుడుగా వున్న కన్నప్ప ఆ తర్వాత శివుడికి భక్తుడిగా మారి శివుడిని ఆరాదిస్తూ ఉంటాడు..అయితే కన్నప్ప శివుడికి భక్తుడిగా ఎలా మారాడు అనేదే ఈ మూవీ కథ. ఈ కథ ముందే తెలిసిన ఈ మైథలాజికల్ చిత్రానికి గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ భారీగా ఉండనున్నట్లు సమాచారం.. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు భారీ స్థాయిలో సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు ‘కన్నప్ప’ మూవీ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో హాలీవుడ్ స్థాయిలో ఎక్కడ లోటు లేకుండా అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.