Leading News Portal in Telugu

Pushpa 2 : పుష్ప 2 లో నటించనున్న ఆ బాలీవుడ్ పాపులర్ యాక్టర్..?



Whatsapp Image 2024 03 08 At 11.12.19 Am

పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే..ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 మూవీ తెరకెక్కుతుంది.పుష్ప 2 మూవీ కోసం తెలుగు ప్రేక్షకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే న్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో వచ్చిన ఫస్ట్ పార్టు బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను కొల్లగొట్టడమే కాదు.. గ్లోబల్‌ బాక్సాఫీస్‌ వద్ద తెలుగు సినిమా సత్తా చాటింది.భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పుష్ప 2 మూవీలో బాలీవుడ్ పాపులర్ యాక్టర్ నటించబోతున్నట్లు సమాచారం. ఆ పాపులర్ యాక్టర్ ఎవరో కాదు కేజీఎఫ్‌లో నెగెటివ్‌ షేడ్స్‌లో అలరించిన బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్‌ దత్‌.. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

అయితే సీక్వెల్‌ ప్రాజెక్టు కోసం మేకర్స్‌ ఇప్పటివరకు కొత్త యాక్టర్ల పేర్లేమి ప్రకటించలేదు. ఒకవేళ మున్నాభాయ్‌ ఈ సీక్వెల్‌లో కనిపించబోయేది నిజమైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి  క్రేజ్ మరింత పెరగనుంది..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సీక్వెల్‌ను ఫస్ట్‌ పార్టు కంటే మించిపోయేలా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్‌ పార్టులో శ్రీవల్లిగా అలరించిన కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి తన యాక్టింగ్‌తో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఫస్ట్‌ పార్టులో మాలీవుడ్‌ స్టార్‌ హీరో ఫహద్‌ ఫాసిల్‌ పోషించిన పాత్ర సీక్వెల్ లో ఫుల్ లెంగ్త్ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మరోసారి సూపర్ హిట్ పాటలు రెడీ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.