Leading News Portal in Telugu

Manjummel Boys: ఆ ఘనత సాధించిన మొట్టమొదటి మలయాళ చిత్రంగా రికార్డ్



Manjummel Boys Review

Manjummel Boys New Reord in North America: ఫిబ్రవరి నెల మలయాళ సినిమాలకు ఒక గోల్డెన్ ఎరా. విభిన్న జోనర్‌లలో విడుదలైన సినిమాలు ప్రేక్షకులతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందుతున్నాయి. అందులో చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమా గురించి జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. రియల్ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను సాధించింది. ఇప్పుడు ఈ సినిమా రికార్డ్ బుక్స్‌లో మరో రెండు రికార్డులు చేరాయి. ఈ యంగ్ స్టర్ సినిమా మలయాళంలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ లో మూడో స్థానానికి చేరుకుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ మోహన్ లాల్ చిత్రం లూసిఫర్ ను అధిగమించి మంజుమ్మేల్ బాయ్స్ ఈ ఘనత సాధించింది. మలయాళ సినీ వర్గాల లెక్కల ప్రకారం 2019లో వచ్చిన లూసిఫెర్ యొక్క చివరి ప్రపంచవ్యాప్త కలెక్షన్లు 127-129 కోట్లుగా ఉన్నాయి.

Maamla Legal Hai Review: ‘రేసుగుర్రం’ విలన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మామ్లా లీగల్ హై’ రివ్యూ

అయితే నిన్నటి కలెక్షన్లతో మంజుమ్మేల్ బాయ్స్ లూసిఫర్‌ను అధిగమించింది. మంజుమ్మేల్ బాయ్స్ ఆల్ టైమ్ మలయాళంలో రెండు అతిపెద్ద హిట్‌లను మాత్రమే కలిగి ఉంది. మోహన్‌లాల్ పులిమురుగన్, 2018 సినిమాలు మంజుమ్మేల్ బాయ్స్ కంటే ముందు ఉన్నాయి. పులిమురుగన్ జీవితకాల గ్రాస్ 144-152 కోట్లుగా అంచనా వేయబడింది. మలయాళ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ సక్సెస్ అయిన 2018 మొత్తం లాభం 176 కోట్లు. ఇక తమిళ నాడులో ఇప్పటికే 25 కోట్లు క్రాస్ చేసిన మంజుమ్మేల్ బాయ్స్ మూడో వారాంతంలో కూడా మంచి బుకింగ్స్ రాబడుతోంది. మంజుమ్మేల్ బాయ్స్ జీవితకాల కలెక్షన్ తమిళనాడు కలెక్షన్ ఎంత వరకు వెళ్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది.అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నార్త్ అమెరికాలో మిలియన్ డాలర్స్ సాధించిన మొట్టమొదటి మలయాళ చిత్రంగా రికార్డ్ నెలకొలింది మంజుమ్మేల్ బాయ్స్. కొడైకెనాల్ కనెక్షన్, గుణ సాంగ్ ఫ్యాక్టర్ తో ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు కూడా బాగా చూస్తున్నారు.