Leading News Portal in Telugu

Mahesh Babu : వైరల్ అవుతున్న మహేష్ బాబు సరికొత్త యాడ్..



Whatsapp Image 2024 03 10 At 2.34.54 Pm

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఫ్యాన్స్ ఫోకస్‌ అంతా ఇప్పుడు మహేష్ తరువాత సినిమా అయిన ఎస్‌ఎస్‌ఎంబీ 29 పైనే ఉంది. గుంటూరు కారం సక్సెస్‌ తర్వాత రాజమౌళి , మహేశ్‌బాబు కాంబినేషన్ లో గ్లోబల్ అడ్వెంచరస్‌ మూవీ తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఎస్‌ఎస్‌ఎంబీ 29 మూవీ హాలీవుడ్‌ రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని ఇప్పటివరకు వచ్చిన వార్తలు చెబుతున్నాయి. మహేశ్‌ బాబు సినిమాలతోపాటు యాడ్స్‌కు కూడా సూపర్ క్రేజ్‌ ఉంటుందనే తెలిసిందే.కూల్‌ డ్రింక్‌ మౌంటెయిన్‌ డ్యూ ను ప్రమోట్‌ చేస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా మౌంటెయిన్‌ డ్యూ కొత్త యాడ్‌ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఆపదలో ఉన్న స్నేహితుడికి సాయం చేసేందుకు మహేశ్‌ బాబు చేసే రిస్కీ స్టంట్స్‌తో కట్‌ చేసిన యాడ్‌ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఎస్‌ఎస్‌ఎంబీ 29 కూడా ఇలా గూస్‌బంప్స్‌ తెప్పించే రిస్కీ షాట్స్‌, సన్నివేశాలతో ప్రేక్షకులను రక్తకట్టించేలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఉహించుకుంటున్నారు.ఆఫ్రికన్‌ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 కి సంబంధించి రాజమౌళి, మహేష్ మిక్స్‌డ్‌ స్టిల్‌ షేర్‌ చేస్తూ.. క్యాప్షన్‌ లేదు.. ఫొటో చాలా మాట్లాడుతుంది.. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ కొనసాగుతోంది..అని ఓ న్యూస్ ఆన్‌లైన్‌లో తెగ హల్ చల్ చేస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ ఈ భారీ బడ్జెట్‌ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో పాపులర్‌ హాలీవుడ్ యాక్టర్‌తో పాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న స్టార్‌ యాక్టర్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఈ చిత్రాన్ని 2026 ఉగాది కానుకగా రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.. మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్‌ వేసినట్టు ఇప్పటికే టాలీవుడ్ సర్కిల్‌లో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.