Leading News Portal in Telugu

Siddhu Jonnalagadda: స్టార్ హీరోయిన్‌తో సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి.. లీక్ చేసేసిన సోదరుడు!



Siddhu-Jonnalagadda

Siddhu Jonnalagadda Brother Comments on Marriage: ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒక్క టాలీవుడ్ అనే కాదు దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ జంటలుగా మారుతున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే మరో యంగ్ హీరో వివాహానికి సంబంధించిన వార్త కూడా తెర మీదకు వచ్చింది. ఆయన ఇంకెవరో కాదు చాలా సంవత్సరాల నుంచి తెలుగు సినిమాలు చేస్తూ డీజే టిల్లు సినిమాతో బ్రేక్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ. సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ బబుల్ గం సినిమాతో మంచి పేరు సంపాదించారు. మధ్యలో మరో రెండు మూడు సినిమాలు కూడా చేసిన ఆయన తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

Nita Ambani : నీతా అంబానీ ధరించిన ఈ నగ ధర ఎన్ని కోట్లో తెలుసా?

ఆ ఇంటర్వ్యూలో భాగంగా చైతు జొన్నలగడ్డను సిద్దు జొన్నలగడ్డ వివాహం గురించి యాంకర్ ప్రశ్నించాడు. సిద్దు జొన్నలగడ్డ ఒక స్టార్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తలు వింటున్నాం అది నిజమేనా అని అడిగితే దానికి చైతు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. స్టార్ హీరోయిన్ ని చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకవేళ స్టార్ హీరోని చేసుకుంటేనే కదా ప్రాబ్లం అని అంటూ నవ్వేశాడు. అయితే స్టార్ హీరోయిన్ నే పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియదు కానీ అతనికి పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ అయితే ఉందని చైతూ చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది కూడా వివాహం జరుగుతుందో లేదో తెలియదు ఆ సమయానికి అన్నీ కుదిరితే జరిగిపోవచ్చు అని ఆయన పేర్కొన్నాడు.