
విలక్షణ నటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2 ‘.. 27 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకేక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలు పెట్టిన యూనిట్ కొన్ని కారణాలు వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు.. ఎట్టకేలకు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది.. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
ఈ సినిమాను 2024 ఏప్రిల్ లో ఇండియన్ 2, 2024 దీపావళిలో ఇండియన్ 3ని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా… అటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు భారతీయుడు 2 సినిమాకి శంకర్ ఒకేసారి పని చేయాల్సి రావడంతో రెండు సినిమాల షూటింగులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.. అలాంటి వార్తలు రిపీట్ కాకుండా సినిమాను విడుదల చెయ్యాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.. పాటలకు ప్రాధాన్యం ఇచ్చే తాజాగా ఓ పాట కోసం ఏకంగా 30 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.. కమల్ 30 కోట్ల బడ్జెట్ తో వేసిన సెట్స్ పై పాటను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నామని యూనిట్ తెలిపింది.. ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది..
ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్,మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్,బ్రహ్మానందం, సముద్రఖని, ప్రియా భవాని శంకర్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.ఇటీవల విడుదలైనటువంటి ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.