Leading News Portal in Telugu

Sharon Stone: హీరోతో పడుకోమని నిర్మాత బలవంతం చేశాడు..



Sharone

Sharon Stone: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఉండాలి అనుకుంటే కొన్నిసార్లు కొన్నింటికి తలవంచక తప్పదు. ముఖ్యంగా హీరోయిన్స్.. క్యాస్టింగ్ కౌచ్ కు అలవాటు పడక తప్పడంలేదు. ఇప్పుడంటే.. వీటిపై పోరాటాలు జరిగి, అందరి ముందు బయటపెడుతున్నారు కానీ, ఒకప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఈ పనిని కానిచ్చేసేవారు. బాగా పేరు తెచ్చుకున్నవారు పైకి చెప్తున్నారు.. కొత్తవారు నోరు మూసుకొని ఉంటున్నారు. ఇది కేవలం ఇండియాలోనే కాదు.. హాలీవుడ్ లో కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే అక్కడే ఇంకా ఎక్కువ ఉంది. తాజాగా ఒక హాలీవుడ్ హీరోయిన్ చాలా ఏళ్ళ తరువాత తనకు జరిగిన ఒక చేదు అనుభవాన్ని తన పుస్తకంలో రాసుకొచ్చింది. ఆమె హాలీవుడ్‌ నటి షరాన్ స్టోన్. బేసిక్ ఇన్స్టింక్ట్ తో కెరీర్ ను మొదలుపెట్టిన షరాన్.. స్లీవర్ అనే థ్రిల్లర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని అభిమానుల మనస్సులో అందాల భామగా కూర్చుండిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ చేసిన ఇంటిమేటెడ్ సీన్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. 90 ల్లో ఈ భామ చేసిన శృంగార సన్నివేశాలు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. స్లీవర్ సినిమా సమయంలో నటుడు బిల్లీ బాల్డ్‌విన్‌ తో శృంగారం చేయమని నిర్మాత తనను బలవంతపెట్టినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఎప్పటి నుంచో ఈ ఆరోపణలు ఆమె చేస్తున్నా.. నిర్మాత పేరు మాత్రం చెప్పలేదు.

Heroines: సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న హీరోయిన్స్ వీరే..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె నిర్మాత పేరుతో సహా బయటపెట్టింది. స్లీవర్ సినిమా నిర్మాత రాబర్డ్‌ ఈవెన్స్‌.. తనను ఎంతో బలవంతం చేశాడని చెప్పుకొచ్చింది. “స్లీవర్ సినిమా చేసే సమయంలో రాబర్డ్‌ ఈవెన్స్‌ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. నేను ఆఫీస్ కు వెళ్లాను. ఈ సినిమాలో నీకు, బిల్లీ బాల్డ్‌విన్‌ కు మధ్య రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. అవి సహజంగా రావాలి అంటే.. బయట కూడా నువ్వు అతనితో చనువుగా ఉండాలి అని చెప్పాడు. చనువు అంటే ఏంటని అడగ్గా.. నువ్వు అతనితో నిజంగానే పడుకోవాలి. అప్పుడే ఆసీన్స్ మీరిద్దరూ ఎంతో సహజంగా చేసినట్లు చూపించగలం అని చెప్పాడు. కానీ, నేను ఆ పని చేయాలనీ చెప్పాను” అని చెప్పుకొచ్చింది.

Ghost Dreams: కలలో దెయ్యాలు పీడిస్తున్నాయా.. అయితే జాగ్రత్త.. అదే కారణం.. ?

ఇక షరాన్ వ్యాఖ్యలపై బిల్లీ బాల్డ్‌విన్‌ తన సోషల్ మీడియా వేదికగా సమాధానం చెప్పాడు. ” ఇన్నేళ్ల తర్వాత షారన్ స్టోన్ నా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదా? ఆమెకు ఇప్పటికీ నాపై ప్రేమ ఉందా..? లేదా నేను దూరంగా ఉన్నందున ఇన్నేళ్ల తర్వాత కూడా ఆమె బాధపడుతుందా?. నేను స్క్రీన్ టెస్ట్ చేసి న్యూయార్క్‌కి తిరిగి వచ్చే మా MGM గ్రాండ్ ఫ్లైట్‌లో వారితో పరిగెత్తిన మరుసటి రోజు ఆమె తన గాల్ పాల్ జానిస్ డికిన్సన్‌తో చెప్పిందా… “నేను అతన్ని నా కోసం చాలా కష్టపడేలా చేస్తాను, అది అతని తల తిప్పేలా చేస్తాను అని. బాబ్ ఎవాన్స్‌తో నేను జరిపిన సమావేశ కథనం ప్రకారం క్రింద ఉన్న ఫోటోలో చివరి సెక్స్ సన్నివేశాన్ని కొరియోగ్రాఫ్ చేయడానికి మాత్రమే ఆమె అంగీకరించింది.. కాబట్టి నేను షారన్‌ను ముద్దు పెట్టుకోనవసరం లేదు.నేను ఒక పుస్తకాన్ని వ్రాసి, షారోన్ గురించి అనేక, చాలా కలతపెట్టే, అసహ్యకరమైన మరియు వృత్తిపరంగా లేని కథలను చెప్పాలా..? అది సరదాగా ఉండవచ్చు” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.