Kubera: నాగ్ నెగెటివ్ రోల్ అన్నారు.. చూస్తే మంచి క్లాస్ లుక్ లో ఉన్నాడు.. శేఖర్ మావా ఏం ప్లాన్ చేశావ్?

Nagarjuna look from Kubera New Shooting Schedule Goes Viral: నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేని, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న ‘కుబేర’ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ మహా శివరాత్రికి విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఎందుకంటే సినిమాలోని ధనుష్ డిఫరెంట్ అవతార్ అందరినీ ఆశ్చర్యపరిచింది. పూర్తిగా గెడ్డాలు పెంచుకుని కాస్త సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నాగ్ నటిస్తున్నాడు అని ముందు నుంచి ప్రచారమా జరుగుతూ ఉండగా ఇప్పుడు అందుకు సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా టీమ్ బ్యాంకాక్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించినట్టు అధికారికంగా ప్రకటించింది. నాగార్జునతో పాటు మరికొందరు నటీనటులు పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కొన్ని టాకీ, యాక్షన్ పార్ట్‌లు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అయితే నిజానికి ముందు నుంచి ఈ సినిమాలో నాగార్జున చేసేది నెగటివ్ రోల్ అంటూ ప్రచారం జరిగింది.
Manjummel Boys Effect: మంజుమ్మెల్ బాయ్స్ ఎఫెక్ట్.. ముగ్గురి అరెస్ట్
ధనుష్ ఒక మాఫియా డాన్ పాత్రలో నటిస్తుండగా ఆయన్ని వెంటాడి, వేటాడే ఒక ఈడీ అధికారి పాత్రలో నాగ్ నటిస్తున్నాడని కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ప్రచారం జరిగింది. కానీ తాజాగా రిలీజ్ చేసిన పిక్స్ లో నాగ్ ను చూస్తే క్లాసీ లుక్ లో కనిపిస్తున్నాడు. ఎవరికీ అది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని కూడా అనిపించదు. దీంతో ఇప్పటివరకు క్లాస్ మూవీస్ చేస్తాడని పేరున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాతో అసలు ఏం ప్లాన్ చేశాడు ? అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇక భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ఇంతకు ముందు ఎవరూ చూడని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా యూనిట్ రిలీజ్ చేసిన వర్కింగ్ స్టిల్ లో నాగార్జున, శేఖర్ కమ్ముల సంభాషిస్తూ కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో వండర్ ఫుల్ వ్యూ కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇక శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఆసియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ కుబేర సినిమాను నిర్మిస్తున్నారు.