Leading News Portal in Telugu

NBK110: బాలయ్య- బోయపాటి కాంబో రిపీట్ .. థియేటర్లు దద్దరిల్లాల్సిందే ..



Balakrishna Boyapati Srinu

నందమూరి బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.. 109 చిత్రంగా ఆ సినిమా తెరకెక్కుతుంది.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా లో బాలయ్య సరికొత్తగా కనిపించబోతున్నాడు.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ అన్ని సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అలాగే నిర్మాణంలో త్రివిక్రమ్ సొంత సంస్థ ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఒక పార్ట్నర్ గా ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఈ ప్రాజెక్టు తర్వాత బాలయ్య 110 సినిమాను లైన్లో పెట్టాడు.. ప్రముఖ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.. చాలా డైరెక్టర్ల పేర్లు వినిపించినప్పటికి ఫైనల్ గా ఓ డైరెక్టర్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం ఏపీ రాజకీయ హడావిడిలోనే ఆయన ఎక్కువగా బిజీ అవుతున్నారు. కాబట్టి స్టోరీల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకునేంత సమయం కూడా దొరకడం లేదు. వీలైనంత తొందరగా బాబి సినిమాను తొందరగా పూర్తి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు బాలయ్య..

బోయపాటి శ్రీను కాంబోలో తదుపరి సినిమాను చేయబోతున్నాడు.. బోయపాటి పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య కోరిక మేరకు కొన్ని మార్పులు కూడా ప్రస్తుతం జరుగుతున్నట్లు సమాచారం. అయితే బాలయ్య కూడా ఆ విషయంలో త్వరలోనే ఒక నిర్ణయానికి రావాలని అనుకుంటున్నాడు.. ఇప్పుడు ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా వ్యవహారిస్తున్నారు.. హీరోయిన్, ఇతర నటుల గురించి త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది..