Leading News Portal in Telugu

Bharathanatyam : సమ్మర్లో ‘భరతనాట్యం’.. ఆరోజే రిలీజ్



Bharathanatyam Releasing

Surya Teja Aelay Bharathanatyam Releasing On April 5: ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ కొడుకు సూర్య తేజ ఏలే డెబ్యూ మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో పీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష, హర్ష వర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, టెంపర్ వంశీ వంటి అనేక మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా లీడ్ పెయిర్ పై చిత్రీకరించిన రొమాంటిక్ నంబర్ చేశావు ఏదో మాయను విడుదల చేసిన మేకర్స్ సినిమా విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు.

Vishwak Sen: సోషల్ మీడియాలో ‘లేపుడు’ ట్రోల్స్.. ఘాటు కౌంటర్ ఇచ్చిన విశ్వక్!

ఏప్రిల్ 5న వేసవిలో ‘భరతనాట్యం’ ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇక ఈ ప్రకటనతో సమ్మర్ హాలిడేస్ ను సినిమా క్యాష్ చేసుకోబోతోందని అర్ధం అవుతోంది. ఇక తన కథలో హీరోలా జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొనే ఔత్సాహిక ఫిల్మ్ మేకర్ గా ఇందులో సూర్య తేజ కనిపించబోతున్నారు. ప్రోమోల్లో సూర్యతేజ తన నటనతో ఆకట్టుకున్నట్టే కనిపిస్తున్నాడు. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించగా, వెంకట్ ఆర్ శాకమూరి డీవోపీగా పని చేస్తున్నారు. రవితేజ గిరిజాల ఈ సినిమాకి ఎడిటర్. ఇక ఈ సినిమాలో సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామితో పాటు వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్ వంశీ, నాగ మహేష్, టార్జాన్, మాణిక్ రెడ్డి, శివన్నారాయణ, సత్తన్న, సంతోష్ బాలకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.