Leading News Portal in Telugu

Avantika Vandanapu: మీన్ గర్ల్స్ పాప కూడా అల్లు అర్జున్ పైనే కన్ను వేసిందే.. ?



Allu

Avantika Vandanapu: అవంతిక వందనపు.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండ్ అయినవారిలో ఈమె కూడా ఒకరు. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం హాలీవుడ్ నే షేక్ చేస్తోంది. “మీన్ గర్ల్స్” ఫిల్మ్ లో కరణ్ శెట్టి పాత్రలో నటించి మెప్పించిన అవంతిక కు సంబంధించిన ఫోటోస్ అండ్ వీడియోస్ ఎంత సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నారై ఫ్యామిలీ చెందిన అవంతిక వందనపు… కాలిఫోర్నియాలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచే మోడలింగ్, యాక్టింగ్, డాన్సింగ్ పైన ఇష్టంతో కెరీర్ ని కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి మార్చేసుకుంది. మొదటిగా 2016లో మహేష్ బాబు చేసిన బ్రహ్మోత్సవం సినిమాలో అవంతిక చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. మహేష్ కి కజిన్ గా నటించిన అవంతిక… ఆ తర్వాత మనమంతా, ప్రేమమ్(తెలుగు), రారండోయ్ వేడుక చూద్దాం, ఆక్సిజెన్ సినిమాలు నటించింది. 2018లో వచ్చిన అజ్ఞాతవాసి తర్వాత అవంతిక తెలుగులో నటించలేదు. భూమిక అనే సినిమాతో తమిళ డెబ్యూ కూడా చేసింది కానీ ఇక్కడి నుంచి కంప్లీట్ గా హాలీవుడ్ షిఫ్ట్ అయిపోయి అక్కడ కెరీర్ ని సెట్ చేసుకునే పనిలో ఉంది.

2021-2024 వరకూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్న అవంతిక వందనపుకి మీన్ గర్ల్స్ బ్రేక్ ఇచ్చింది. ఇక ఈ బ్రేక్ తరువాత అవంతిక.. మొట్టమొదటిసారి తెలుగులో ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తనకు నచ్చిన హీరో గురించి చెప్పి తెగ సిగ్గుపడిపోయింది. తనకు అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టమని చెప్పుకొచ్చింది. ” ఫెవరేట్ హీరో అల్లు అర్జున్.. చిన్నగా ఉన్నప్పుడు నుంచి ఆయన అంటే ఇష్టం. ముఖ్యంగా ఆయన డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం.. నేను డ్యాన్సర్ కాబట్టి, ఆయన డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ కాబట్టి ఆయన అంటే ఇష్టం. ఇక పెయిర్ గురించి అంటే.. కొత్త కొత్తవారు వస్తున్నారు. అప్పుడే చెప్పడం కష్టం. తెలుగులో అవకాశాలు వస్తే మా అమ్మానాన్నలతో పాటు నేను ఇక్కడే ఉంటున్నాను. నన్ను డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వొచ్చు” అని హింట్ కూడా ఇచ్చేసింది. మొన్నటికి మొన్న ప్రేమలు బ్యూటీ మమితా బైజూ కూడా బన్నీ అంటే పడిచస్తాను అని చెప్పింది. ఇప్పుడు ఈ పాప కూడా బన్నీ మీదనే కన్నేసింది. మరి ముందు ముందు భవిష్యత్తు లో వీరు బన్నీ సినిమాల్లో కనిపిస్తారేమో చూడాలి.