
Heroine Surbhi Post about Bad Flight Experience goes Viral: చావు నుంచి తృటిలో తప్పించుకున్నాను అని అంటూ టాలీవుడ్ హీరోయిన్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సురభి గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్ కిషన్ హీరోగా బీరువా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఎక్స్ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్మెన్ లాంటి సినిమాలతో వరుస అవకాశాలు దక్కించుకుంది. ఇక అల్లు శిరీష్ ఒక్క క్షణం సినిమాతో పాటు ఆది హీరోగా నటించిన శశి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆమె ఇప్పుడు ఇతర భాషల్లో సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా తాను తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాను అంటూ పోస్టల్ మీడియా వేదికగా వెల్లడించింది.
Anupama: బోల్డ్ అంటూ బోలెడు ప్రశ్నలు.. బరస్టయిన అనుపమ
ఆమె పోస్ట్ చేసిన దాని ప్రకారం ఆదివారం నేను విమానంలో ప్రయాణించాను ఆ ప్రయాణంలో నాకు ఇప్పటివరకు ఎదురుకాని ఒక సంఘటన ఎదురయింది దానివలన నేను చావు అంచుల వరకు వెళ్లి వచ్చానేమో అనే ఫీలింగ్ కలిగింది అని చెప్పుకొచ్చింది. విమానంలో సాంకేతిక లోపం వల్ల ఒక ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడింది, ఏకంగా ఫ్లైట్ మొత్తం పైలెట్ కంట్రోల్లో లేకుండా పోయింది. ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది అయితే పైలెట్ తీసుకున్న ఒక తెలివైన నిర్ణయంతో చాలా సేపు టెన్షన్ తో ఉన్న తర్వాత బతికిపోయాం. ఇప్పటికీ కూడా ఆ ఘటన తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. నేను ఈ రోజు ఇలా బతికున్నందుకు నాలో ఉన్న పాజిటివ్ థింకింగ్ మీద నాకు ఇంకా నమ్మకం పెరిగింది అంటూ సురభి రాసుకొచ్చింది. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ వ్యవహారం జరిగింది అనే విషయం మీద ఆమె క్లారిటీ ఇవ్వలేదు.