Leading News Portal in Telugu

Chiranjeevi : నెట్టింట వైరల్ అవుతున్న చిరంజీవి టెన్త్ సర్టిఫికెట్..ఇది గమనించారా?



Chiru Certificate

మెగాస్టార్ చిరంజీవి పేరు తెలియని వాళ్లు ఉండరు.. స్వయం కృషితో పైకొచ్చిన హీరో.. అందుకే తెలుగు ఇండస్ట్రీలోని వారంతా ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు.. ఏజ్ పెరుగుతున్న సినిమాలను వదలడం లేదు.. కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తూ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. చిరంజీవి దూకుడుకు అవాక్కవుతున్నారు సినీ ప్రేక్షకులు.. అయితే చిరంజీవి గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది..

మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలకు గానూ ఆయనకు ప్రభుత్వం ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డును అందించింది.. ఇదిలా ఉండగా ఇప్పుడు చిరంజీవి పదోతరగతి సర్టిఫికెట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.. ఆ సర్టిఫికెట్ లో చిరంజీవి పేరు ఎస్.ఎస్. వర ప్రసాద రావు గా ఉండ‌గా, తండ్రి పేరు: కొణిదెల వెంకట్రావు, నేషనాలిటీ: ఇండియన్, హిందు, తెలుగు లింగం: పురుష, పుట్టిన తేదీ: 22.08.1955 పుట్టిన స్థలం : పెనుగొండ అని ఉంది.. ఇందులో ఉన్న పేరు గురించి అందరికి తెలుసు.. కానీ ఆయన జన్మస్థలం ఏపీ మొగల్తూరు అని అందరు అనుకున్నారు.. కానీ ఆ సర్టిఫికెట్ లో మాత్రం పెనుగొండ అని ఉంది.. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..

ఆయన కేవలం హీరోగానే కాదు.. ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ జనాల దృష్టిలో రియల్ మెగాస్టార్ అయ్యాడు.. ఆయన సినిమాలు జనాలను మెప్పిస్తాయి.. అందుకే మన దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..