Leading News Portal in Telugu

Mohan Babu: మోడీ లాంటి వ్యక్తి భారతదేశానికి అవసరం



Mohan Babu Birthday

Mohan Babu Crucial Comments on Narendra Modi: మోహన్ బాబు పుట్టిన రోజు – ఎంబియు యూనివర్సిటీ వార్షికోత్సవ వేడుకలలో మంచు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నో సందర్భాల్లో కలిశానని, అలాంటి ఆలోచనలు, విధానాలు కలిగిన వ్యక్తి భారతదేశానికి అవసరం అని ఆయన అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయండి అని కోరిన ఆయన ఇద్దరూ డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు మనవే, లంచాలు తీసుకున్న డబ్బులు, ఆ డబ్బులు తీసుకోండని అన్నారు. అయితే ఓటును మాత్రం నచ్చిన వారికి వేసి, భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్లడానికి సహకరించండని ఆయన కోరారు.

Prime Video: అమెజాన్ ప్రైమ్ అనౌన్స్ చేసిన 64+ కంటెంట్ లిస్ట్ ఇదే

ఇక శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఘనంగా 32 వ వార్షికోత్సవం, మంచు మోహన్ బాబు జన్మదిన వేడుకలు ఒకేసారి జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ మళయాళ నటుడు మోహన్ లాల్, ఆర్టిస్ట్ ముఖేష్ రిషి హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా మోహన్‌లాల్‌ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యారంగంలో తన సహ నటుడు మోహన్‌బాబు తనదైన ముద్రవేస్తున్నారని అభినందించారు. విద్యార్థుల కోసం మోహన్ బాబు ఉత్తమమైన మౌలిక సదుపాయాలను ఎలా కల్పించారో నేను పూర్తిగా అవహగాన చేసుకున్నానని అన్నారు. ఇక మరోపక్క. ఎడ్యుకేషనల్ గ్రూప్‌ను ప్రఖ్యాత విశ్వవిద్యాలయంగా మార్చడానికి తన మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని శ్రీ మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.