
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన సెన్సేషనే.. ఎవరు ఏమి అనుకున్నా పర్వలేదు నాకు నచ్చిందే చేస్తా అనే మనస్తత్వం ఆయనది.అదే మనస్తత్వం ఆయన సినిమాలలో కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు కమర్షియల్, క్రైమ్ జోనర్లలో చిత్రాలు తెరకెక్కించి రికార్డులు తిరగరాసిన ఆర్జీవీ.. ప్రస్తుతం అన్ని అడల్ట్ మరియు పొలిటికల్ డ్రామా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.. తాజాగా తన లేటెస్ట్ మూవీ టైటిల్ ను రివీల్ చేశారు వర్మ. ఆ టైటిల్ కంటే దానిపై వస్తున్న కామెంట్స్ మరింత ఫన్నీగా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. ఇంతకు ఆర్జీవీ పెట్టిన టైటిల్ ఏంటంటే.. ‘నా పెళ్లాం దెయ్యం’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని వర్మ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అందులో దూరంగా ఒక మహిళ కిచెన్లో నిలబడి పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. దాని కింద తాళి ఫోటో ఉంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ గురించి పక్కన పెడితే.. దీని టైటిల్ గురించే నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
‘నా పెళ్లాం దెయ్యం’ అనే టైటిల్ చూసి ‘అందరి పెళ్లాలు దెయ్యాలే’ అని కామెంట్ చేశాడు ఒక నెటిజన్. ‘ఈరోజుల్లో ఇలాంటి సినిమా చాలా అవసరం’ అని మరొక వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్ చూసి ఇతర నెటిజన్లు కూడా నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ‘శారీ’ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూర్గ్ లో జరుగుతోంది. తాజాగా కూర్గ్ లో సాంగ్ షూటింగ్ కూడా పూర్తయ్యిందని ఆర్జీవీ అప్డేట్ ఇచ్చారు. ఇందులో కేరళకు చెందిన ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆరాధ్య దేవి హీరోయిన్ గా నటిస్తోంది.వర్మ గత చిత్రాల తరహాలోనే ‘శారీ’ కూడా పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కుతోందని మూవీ నుంచి విడుదలయిన పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం ‘శారీ’ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో తన అప్ కమింగ్ మూవీ ‘నా పెళ్లాం దెయ్యం’ గురించి ఆర్జీవీ అప్డేట్ ఇచ్చారు.