Leading News Portal in Telugu

Ariaana Manchu: విష్ణు కూతురిలో ఈ టాలెంట్ ఉందా?.. ఫ్యూచర్ స్టార్ అవ్వడం పక్కా..



Ariaanaa

మంచు మోహన్ బాబు గురించి ఆయన ఫ్యామిలీ గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఇటీవల మార్చి 19 మోహన్ బాబు 72 వ వసంతంలోకి అడుగు పెట్టారు.. ఆయన పుట్టినరోజు సందర్బంగా, అలాగే శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల 32వ వార్షికోత్సవంతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో మోహన్ బాబు కొడుకులు విష్ణు, మనోజ్, కూతురు లక్ష్మి ప్రసన్నతో పాటు కుటుంబ సభ్యులు హాజరాయ్యారు.. అంతేకాదు సినీ ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు..

మంచు మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పలువు కళాకారులు, ఆటా పాటలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా.. మంచు విష్ణు కూతురు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.. పెద్దకూతురు అరియానా పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది.. ఆమె పాడే విధానం, గొంతు సూపర్ గా ఉన్నాయని అందరు ప్రశంసలు కురిపించారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

ఆ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారింది.. దాన్ని చూసిన నెటిజన్లు మరియు మోహన్ బాబు అభిమానులు అరియానా పాడిన తీరుపై ప్రశంసిస్తున్నారు.. ఖచ్చితంగా ఫ్యూచర్ స్టార్ అవుతుందని కామెంట్ చేస్తూ వీడియోను మరింత వైరల్ అవుతుంది.. ఇక మంచు విష్ణు సినిమాల విషయానికొస్తే.. కన్నప్ప సినిమా చేస్తున్నాడు.. ఇటీవల విడుదలైన పోస్టర్స్ జనాలను బాగా ఆకట్టుకోవడంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.. త్వరలోనే సినిమా విడుదల కాబోతుంది..