
Sreemukhi slaps on Hero Parvateesam Face: నటిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తరువాత యాంకర్ గా మారింది శ్రీముఖి. పటాస్ అనే షోతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె తర్వాత పలు సినిమాల్లో సైతం నటించింది. ఇక బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ పెంచుకున్న ఆమె ఇప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే యాంకర్ గా కొనసాగుతోంది. అయితే తాజాగా ఆమె ఒక హీరో చెంప పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆమె కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ క్రమంలోనే సినిమాలోని ఒక సీన్ ను రీ క్రియేట్ చేసిన క్రమంలో చెంపపగల కొట్టింది.
Prithviraj Sukumaran: 5 మినిట్స్ లిప్ లాక్ .. నాగార్జున రికార్డ్ కు బ్రేక్.. ?
పార్వతీశం కొత్త హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. వినూత్న ప్రమోషన్లతో ఈ సినిమా సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ మధ్యనే మేకర్స్ మార్కెట్ మహాలక్ష్మి ట్రైలర్ రిలీజ్ చేశారు. “మార్కెట్ మహాలక్ష్మి” ట్రైలర్ చూస్తే ఒక తండ్రి తన కొడుక్కి పెళ్లి, కట్నం కోసమే చేయాలనుకోవడంతో మొదలయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన పార్వతీశం వాటిని తిరస్కరించి మార్కెట్ లో కూరలు అమ్ముకునే ప్రణీకాన్వికను చూసి ప్రేమించడంతో సాగుతుంది.