
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వుంది.బాలీవుడ్ లో వరుస చిత్రాలలో నటిస్తూనే టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ లో ఆఫర్స్ అందుకుంటుంది. ఇప్పటికే ఈ భామ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం అందరికి తెలిసిందే.. ఇక ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే మరో పాన్ ఇండియా మూవీ ఆఫర్ ను అందుకుంది.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్సీ 16’లో ఈ భామ హీరోయిన్ గా ఎంపిక అయింది.నిన్ననే ఈ మూవీ ప్రారంభోత్సవం కూడా ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ మూవీ ప్రారంభానికి ముందు జాన్వీ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకుంది.ఆమెతో పాటు సీనియర్ నటి మహేశ్వరి, జాన్వీ కపూర్ బాయ్ ఫ్రండ్ తో పాటు బీ-టౌన్ సెలబ్రిటీ స్టైలిస్ట్ ఓరీ కూడా దేవస్థానాన్ని సందర్శించారు..
ఈ సందర్భంగా వ్లాగ్ చేసిన అతడు అప్పుడు తీసిన వీడియో ప్రస్తుతం తన యూట్యూబ్ చానల్లో షేర్ చేశాడు. ఇందులో జాన్వీ కపూర్ కాలినడకన తిరుమల కొండ ఎక్కి తన మొక్కు చెల్లించుకుంది. ఈ సందర్భంగా ఆమె మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కింది .ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా శ్రీవారి దర్శనంలో భాగంగా వీరు తిరుపతి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్న జాన్వీ కపూర్ మోకాళ్లపై మోకాళ్ల పర్వతం మెట్లెక్కింది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ గా మారింది.ఇదిలా ఉంటే నిన్న ఆర్సీ 16 పూజా కార్యక్రమంలో జాన్వీ చీరకట్టులో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ఆమె తన తండ్రి బోణీ కపూర్ తో కలిసి పాల్గొంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఈ మూవీ పూజ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏఆర్ రెహమాన్, నిర్మాత అల్లు అరవింద్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వంటి తదితర టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. కాగా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.