Leading News Portal in Telugu

Tillu Square Censor: టిల్లన్న హడావుడి చూసి ఏదో అనుకుంటే.. ఇలా షాకిచ్చారేంటి?



Tillu Square

Tillu Square Censored and certified with 𝐔/𝐀: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ అనౌన్స్ చేశారు. మొదటి పార్ట్ లో నేహా శెట్టి నటించగా ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా రాధికా.. రాధికా సాంగ్ మాత్రం చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడేకొద్దీ ప్రమోషన్స్ వేగాన్ని పెంచేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ఓ మై లిల్లీ ను కూడా రిలీజ్ చేశారు.

Uppena Movie : బాలీవుడ్ లోకి ‘ఉప్పెన’ మూవీ.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంది. డీజే టిల్లు లో రొమాంటిక్ సాంగ్ లానే అనిపించింది. ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టినప్పటి నుంచి సినిమాలో అడల్ట్ డోస్ ఎక్కువ ఉంటుందని హింట్ ఇచ్చేలా అనిపించింది. కానీ తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి కాగా సెన్సార్ సభ్యులు సినిమా చూసి యూ\ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే పెద్దల సమక్షంలో పిల్లలు ఈ సినిమ చూడొచ్చన్నమాట. దీంతో ఈ సినిమాతో మంచి హాట్ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు అని భావించిన యూత్ కి నిరాశే అని చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో మార్చి29న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకానుంది. ఇందులో భాగంగానే ఇదివరకే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది.