Leading News Portal in Telugu

Biju Menon: ఈ విలన్ భార్య హీరోయిన్.. ఎంత అందంగా ఉందో చూశారా?



Biju Menon On Samyuktha Varma

Biju Menon with his Wife Samyukta Varma at Guruvayoor Temple: బిజు మీనన్ నిజానికి మళయాలంలో బిజీ ఆర్టిస్ట్. తెలుగులో కూడా ‘ఖతర్నాక్’, ‘రణం’ వంటి సినిమాలు చేశారు. టాలీవుడ్ లో ఆయన పెద్దగా ఫేమస్ కానప్పటికీ.. మళయాలంలో మంచి క్రేజ్ ఉంది. ‘అయ్యప్పన్ కోశియుమ్’ సినిమాతో ఆయన రేంజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఆయన భార్య కూడా సినిమా నటే.

Ayesha Khan: ఓర్నీ.. ఈ పిల్ల జోరు మాములుగా లేదుగా.. మరీ ఇంత ఫాస్టా..?

ఆమె మలయాళ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఉండేవారు. అయితే వివాహం తరువాత నటనకు దూరం అయ్యారు. ఇక తాజాగా కేరళ గురువాయూర్ ఆలయంలో మలయాళీల అభిమాన సినీ జంట బిజు మీనన్ – సంయుక్త వర్మ కలిసి కనిపించారు. ఈ ఇద్దరూ చాలా అరుదుగా కలిసి బహిరంగ ప్రదేశాలను సందర్శిస్తారు. సంయుక్త సాంప్రదాయ కేరళ దుస్తులలైన చీరలో వచ్చింది.

Ss1
బిజు మీనన్ కూడా సంప్రదాయ దుస్తుల్లోనే వచ్చారు. ఇక త్రిసూర్‌కు చెందిన సంయుక్త త్రిసూర్ కేరళ వర్మ కాలేజీలో చదువుతున్న సమయంలో ‘వీండుం చిల భూకార్యమనల్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. నాలుగేళ్లు మాత్రమే నటించినా, తన ప్రతిభను నిరూపించుకుని, బలమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోగలిగింది. ఇక వెండితెరపై మొదలైన ప్రేమతోనే బిజు, సంయుక్త జీవితంలో ఒక్కటయ్యారు. వివాహానంతరం గృహిణిగా మారిన సంయుక్త యోగాను అభ్యసించి యోగా శిక్షకురాలిగా మారారు.
Ss