Leading News Portal in Telugu

Ayesha Khan: ఓర్నీ.. ఈ పిల్ల జోరు మాములుగా లేదుగా.. మరీ ఇంత ఫాస్టా..?



Ayesha

Ayesha Khan: సినిమా ఇండస్ట్రీ ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో.. ఎవరిని ఎప్పుడు అధఃపాతాళానికి తొక్కేస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ఇండస్ట్రీలో వారందరూ గ్లామర్ ఉన్నప్పుడే వరుస అవకాశాలను అందుకొని నాలుగురాళ్లు వెనకేసుకుంటున్నారు. ఇక గత కొంతకాలంగా హిట్ అయిన సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లు మాత్రమే కాదు, స్పెషల్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు, నెగెటివ్ రోల్స్ చేసిన హీరోయిన్లను కూడా క్రష్ లా మార్చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఆ క్రష్ లిస్ట్ లోకి చేరింది అయేషా ఖాన్. అసలు ఎవర్రా ఈ అమ్మాయి అని అంటే.. నేడు ఓం భీమ్ బుష్ చూసినవారికి బాగా గుర్తుండిపోతుంది. అంటే మన తాలూకా కాదులెండి.. బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ. ముఖచిత్రం అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది హిందీ బిగ్ బాస్ 17 షోలో పాల్గొని రచ్చ లేపింది. హౌస్ నుంచి బయటకు వచ్చాకా అమ్మడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ఓం భీమ్ బుష్ లో అమ్మడు ఉన్నది కొద్దిసేపే అయినా కూడా అందాల ఆరబోత చేసి కుర్రకారును తన వైపుకు తిప్పుకుంది.

ఇక ఇదొక్కటే కాకుండా ఈ చిన్నది వరుస సినిమాలకు సైన్ చేసి అదరగొడుతుంది. విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అయేషా.. స్పెషల్ సాంగ్ చేస్తుంది. తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మోత అంటూ సాగే ఈ సాంగ్ హోలీరోజున రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక పోస్టర్ లో వైట్ చీరలో అయేషా.. అప్సరసలా కనిపిస్తుంది. ఇక ఈ సాంగ్ కనుక హిట్ అయితే అమ్మడుని ఆపడం కష్టమే. ఇవే కాకుండా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ లో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో సినిమా ఆఫర్ కూడా దక్కించుకున్నట్లు సమాచారం. ఇలా ఈ పిల్ల జోరు ఇప్పుడు మాములుగా లేదు. మరి ఈ చిన్నది ఏ రేంజ్ లో టాలీవుడ్ లో ఎదుగుతుందో చూడాలి.