ఈ మధ్య కాలంలో ప్రజెంట్ హీరోయిన్స్ కన్నా కూడా సీనియర్ హీరోయిన్లకు డిమాండ్ భారీగానే పెరిగింది.. సీనియర్ హీరోయిన్లు ఏజ్ పెరుగుతున్నా గ్లామర్ మాత్రం తగ్గలేదు.. అలాంటి హీరోయిన్లలో ఒకరు సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణ.. ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మరీ యంగ్ గా మారిపోతోంది. శివగామీ లేటెస్ట్ లుక్ చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..
రోజు రోజుకు మరింత యంగ్ గా మారిపోతున్న శివగామి వయసు 50 ఏళ్లు పైనే.. ఇంత వయస్సు వచ్చిన చెక్కు చెదరని అందంతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది.. రోజు రోజుకు అందాన్ని తింటుందా అనేట్లు ఆమె గ్లామర్ ఉంది.. ప్రస్తుతం కెరీర్ లో రమ్య కృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. ప్రభాస్ ‘బాహుబలి’ వంటి భారీ చిత్రాల్లో నటించిన ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. దాంతో ఎక్కువగానే సినిమాలను లైనప్ లో పెట్టుకుంటుంది..
ఈ అమ్మడు తెలుగులోనే కాదు తమిళంలో కూడా స్టార్ హీరోలతో జత కడుతూ కుర్రకారును ఫిదా చేస్తుంది.. లైగర్’, ‘రంగమార్తాండ’, ‘జైలర్’, ‘గుంటూరుకారం’ వంటి చిత్రాలతో అలరించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై ఇలా తెగ సందడి చేస్తోంది.. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది.. స్లీవ్ లెస్ టాప్ లో మెరిసింది. ఆకట్టుకునే అందంతో ,యంగ్ లుక్ తో అందరిని తనవైపు తిప్పుకుంటుంది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..