Leading News Portal in Telugu

Happy Days Re release : మళ్లీ థియేటర్లలోకి రాబోతున్న హ్యాపీ డేస్.. ఎప్పుడంటే?



Happydays

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.. ఇప్పటికే ఎన్నో సినిమాలు మళ్లీ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. కొన్ని సినిమాలు సినీ లవర్స్‌కు ఎంతలా నచ్చుతాయంటే.. ఎన్నో వందల సార్లు చూసినా సరే మళ్లీ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతుంటాం. అలాంటి సినిమాల్లో హ్యాపీడేస్‌ ఒకటి.. ఈ సినిమా పదిహేడేళ్ల క్రితం వచ్చినా ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు.. అందుకే ఈ సినిమా రీరిలీజ్ కోసం యూత్ వెయిట్ చేస్తున్నారు..

ఈ సినిమాను చూసే చాలా మంది ఇంజనీరింగ్ చేశారంటే అతిశయోక్తి కాదు.. కాలేజీ లైఫ్ గురించి అక్కడ ఎదుర్కొనే పరిస్థితుల గురించి అందరికి చక్కగా చూపించారు.. శేఖర్ కమ్ముల టేకింగ్ అందరిని ఆకట్టుకుంది.. అందుకే సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. యాక్టర్స్ పర్మార్మెన్స్‌, మిక్కీ మ్యూజిక్‌ ఇలా చెప్పుకుంటే పోతే సినిమా గురించి ఓ పుస్తకమే రాయోచ్చు. అంతలా ఈ సినిమా జనాలకు ఎక్కేసింది..

ఈ సినిమాను అతి తక్కువ బడ్జెట్ లో రూపోందించినా కూడా పది కోట్లకు పైగా వసూల్ చేసి బాక్సాఫీస్ రికార్డులను అందుకుంది.. దాంతో సినిమా రీరిలీజ్ కూడా మంచి టాక్ ను అందుకుంటుందని అందరు భావిస్తున్నారు.. ఈ సినిమా రీరిలీజ్ అవుతుందని గతంలో చాలా వార్తలు వినిపించాయి.. కానీ దీనిపై గతంలో మేకర్స్ ఎటువంటి క్లారిటి ఇవ్వలేదు.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రీరిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 12 సినిమా రీరిలీజ్ కాబోతుంది.. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ వైరల్ అవుతుంది..