
Facts Came about Siddharth AditiRao Hydari Marriage: సినీ హీరో సిద్ధార్థ్ తనతో కలిసి మహాసముద్రం అనే సినిమాలో నటించిన అదితీరావు హైదరితో గత కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి ఎన్నో సందర్భాలలో కెమెరాల కంటపడ్డారు. మీడియా ప్రశ్నించినప్పుడు ఈ విషయాన్ని దాటవేస్తూ వచ్చిన సిద్ధార్థ ఈరోజు మధ్యాహ్నం మాత్రం సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న విషయం మీడియాకి చేరింది. అయితే ఈ వివాహానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే వీరి వివాహం తెలంగాణలోని పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో జరిగింది. అయితే ముందుగా ఇక్కడ సినిమా షూటింగ్ చేస్తున్నామని ఆలయ నిర్వహకులకు చెప్పి వారి నుంచి పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
Tillu Square First Review: టిల్లు స్క్వేర్లో ఇవే హైలైట్స్.. ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!
సినిమా షూటింగ్ జరుగుతోంది కాబట్టి స్థానిక పూజారులను సైతం లోపలికి అనుమతించలేదు సిద్ధార్థ టీం. నిజంగానే సినిమా షూటింగ్ అనుకున్నారు అక్కడి స్థానికులు, పూజారులు. కానీ సిద్ధార్థ తెలివిగా తమిళనాడు నుంచి పూజారులను పిలిపించుకొని వివాహ తంతు పూర్తి చేశారు. అంతా పూర్తయిన తర్వాత మీడియాలో వార్తలు రావడంతో ఆలయ నిర్వహకులు, అక్కడి స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమకు సినిమా షూటింగ్ అని పర్మిషన్ తీసుకుని నిజంగానే పెళ్ళి చేసుకున్నారని వారు పేర్కొన్నారు. అదితీ రావు హైదరి తల్లి విద్యా రావు తెలంగాణకు చెందిన వనపర్తి సంస్థానానికి చెందిన చివరి రాజు జే రామేశ్వరరావు కుమార్తె. ఈ నేపథ్యంలోనే జే రామేశ్వరరావు వారసులు జై కృష్ణదేవరావు కుటుంబం ఈ వివాహానికి హాజరైంది. వీరిద్దరికీ చెందిన అతి సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన సిద్ధార్థ – అదితీరావు హైదరీ దంపతుల నుంచి రావాల్సి ఉంది.