Leading News Portal in Telugu

Mytri Movies:గుంటూరులో మైత్రి సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ ఓపెన్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్..



Mytrimovies

తెలుగు చిత్రపరిశ్రమలో అతి పెద్ద నిర్మాణ సంస్థ అంటే మైత్రి మూవీ మేకర్స్.. ఎన్నో వందల సినిమాలను తమ బ్యానర్ పై నిర్మించారు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను నిర్మిస్తు జోరు మీద ఉన్నారు.. ఒక్క తెలుగులోనే కాదు హిందీ, తమిళ్లో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు.. ఈ నిర్మాణ సంస్థ మొదలు పెట్టిన ఆరంభంలోనే భారీ ప్రాజెక్టు లను నిర్మిచారు.. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమాలను అందుకున్న ఈ నిర్మాణ సంస్థ ఆ తరువాత రంగస్థలం, పుష్పతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది.

ఈ నిర్మాణంలో సినిమా వచ్చిందంటే అది సూపర్ హిట్ అనే రేంజులో నిర్మాణ సంస్థ ఉంది.. ప్రస్తుతం తెలుగులో వస్తున్న స్టార్ హీరోల సినిమాలను నిర్మిస్తుంది.. ఇదిలా ఉండగా ఈ నిర్మాణ సంస్థ గురించి ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. గుంటూరులో మైత్రి సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ ఓపెన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా మల్టీఫ్లెక్స్ ను మార్చి 29 న గ్రాండ్ గా ఓపెన్ చేయబోతున్నారు కూడా.. అందుకు పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.. ఆ పోస్టర్ లో రీసెంట్ మూవీస్ పోస్టర్స్ ను ఉంచారు.. ప్రస్తుతం ఈ వార్త చర్చనీయంశంగా మారింది..

మైత్రి మూవీ సినిమాల విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, అల్లు అర్జున్ తో చేస్తున్న పుష్ప2, రామ్ చరణ్ తో ఇప్పటికే రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ నిర్మాణ సంస్థ..ఆయనతో మరో రెండు సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. RC16, RC17 సినిమాలు, అలాగే ప్రభాస్, సితారామం ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో కూడా ఒక సినిమా, తమిళ టాప్ హీరో అజిత్ తో ఓ సినిమాను చేస్తున్నారు.. ఇవేకాక ఇంకో ఐదు ప్రాజెక్టు లను టెకాఫ్ చెయ్యనున్నట్లు తెలుస్తుంది..