
These Directors doing Movies in Same Banner: హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కలిసి సినిమా సక్సెస్ అయితే హిట్ పెయిర్ అంటాం. అదే డైరెక్టర్.. ప్రొడ్యూసర్ కాంబో హిట్ అయి… మళ్లీ మళ్లీ ఈ కాంబో కలిస్తే.. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అంటాం. లేదంటే.. ఇద్దరికీ భలే సింక్ అయిందంటాం. రాను రాను ఇదొక సెంటిమెంట్ అయిపోయింది. ఇలా సింక్ అయిన కాంబోస్ నాలుగైదు వున్నాయి. ఒకరినొకరు వదిలిపెట్టకుండా.. కంటిన్యూ చేస్తున్నారు కొంత మంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ రిపీట్ అవడం చూస్తుంటే హిట్ కొట్టిన దర్శకుడికి ఆ నిర్మాతే కావాలి, ప్రొడ్యూసర్‌కి ఆ డైరెక్టరే కావాలి అన్నట్టు మారిపోయింది పరిస్థితి.
Tillu Square: టిల్లు స్క్వేర్‌కి ఏమైంది? మీడియా షోతో పాటు యూఎస్ ప్రీమియర్స్ కూడా క్యాన్సిల్?
ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి 7 సినిమాలు తీస్తే అందులో 5 దిల్ రాజుతోనే ఉన్నాయి. ఇప్పుడు భగవంత్ కేసరి తర్వాత ఎనిమిదో సినిమా కూడా దిల్ రాజుతోనే అనిల్ రావిపూడి కమిటైనట్టు చెబుతున్నారు. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి ఒక సినిమా ప్లాన్ చేశారు. ఇక అదే కోవలో త్రివిక్రమ్ కూడా ఒకే బేనర్‌లో సినిమాలు చేస్తున్నారు. హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ తోనే ఆయన సినిమాలు చేస్తున్నారు. భార్య నిర్మాతగా ఫార్చున్ ఫోర్ సినిమాస్ అనే ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించి హారిక హాసిని సంస్థతో పాటు సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో చేస్తున్న అన్ని సినిమాలకు సహానిర్మాణ సంస్థగా కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు.
అంతకు ముందు వరకు పరిస్థితి వేరు కానీ రామ్ చరణ్ తో చేసిన రంగస్థలం హిట్ తర్వాత మైత్రీతోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు సుకుమార్. పుష్ప.. పుష్ప2.. త్వరలో RC 17 మూవీ కూడా అదే బ్యానర్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ అనే తన సొంత బ్యానర్ సహనిర్మాణ సంస్థగా ఈ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇక తమకు బాగా కలిసొచ్చిన బేనర్స్ కి స్లీపింగ్ పార్టనర్స్‌గా త్రివిక్రమ్, సుకుమార్ వ్యవహరిస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మరోపక్క డైరెక్టర్ వంశీ పైడిపల్లి 6 సినిమాలు తేస్తే.. 6 దిల్ రాజుతోనే ఉన్నాయి. వంశీ డెబ్యూ మూవీ మున్నా ఫ్లాప్ అయినా.. బృందావనం ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజుతోనే వంశీ పైడిపల్లి ప్రయాణం నడుస్తోంది. మరోపక్క ఒక సినిమా హిట్ అయితే.. సీక్వెల్స్ పూర్తయ్యేవరకు అదే బేనర్‌లో చేయాల్సిందే. ఈ క్రమంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్ మధ్య అనుబంధం పెరిగిపోతుంది. కెజిఎఫ్.. కెజిఎఫ్2తో ప్రశాంత్‌నీల్ హోంబలే మూవీస్‌తో సింక్ అయిపోయాడు. ఆతర్వాత సలార్ వచ్చింది. త్వరలో సలార్2… కెజిఎప్3 సెట్స్‌పైకి రానుంది. ఎన్టీఆర్-ప్రశాంత్ కాంబోని మాత్రం.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఇలా కొంతమంది సక్సెస్ఫుల్ డైరెక్టర్లు కొన్ని బ్యానర్లకు మాత్రమే పరిమితం అవడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది.