Leading News Portal in Telugu

Alia Bhatt : అలియాభట్ మెడలో మెరిస్తున్న ఈ నెక్లేస్ ధర తెలిస్తే షాక్ అవుతారు..



Aliabhattt

బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు సుపరిచితమే.. రాజమౌళి త్రిపుల్ ఆర్ సినీమాతో ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది..ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన అలియాభట్ ధరించిన ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..

సాదారణంగా సినీ సెలెబ్రీటీలు లగ్జరీ వస్తువులను వాడుతుంటారు.. అవి చాలా ఖరీదైనవిగా ఉంటాయి.. తాజాగా అలియాభట్ మెడలో వేసుకున్న ఆ నెక్లెస్ ఖరీదుతో రెండు ఇల్లు కొనవచ్చు.. అలియాభట్ రీసెంట్ గా లండన్ లో సలాం బాంబే ఫౌండేషన్ వారు నిర్వహించిన హోప్ గాలా అనే ఈవెంట్ లో పాల్గొంది.. ఆ ఈవెంట్ లో చాలా సింపుల్ గా కనిపించింది.. కానీ మెడలో మెరిసిన నెక్లేస్ ధర పై నెట్టింట చర్చలు జరుగుతున్నాయి..

ఆ నెక్లేస్ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా కూడా దాని ధర మాత్రం కోట్లల్లో ఉంటుంది.. ఆలియా భట్ వేసుకున్న ఆ డైమండ్ నెక్లెస్ ధర దాదాపు 20 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం అలియా భట్ వేసుకున్న ఆ డైమండ్ నెక్లెస్ ధర తెలిసి అందరు నోర్లు వెల్లబెడుతున్నారు.. ఏంటి 20 కోట్లునా అని షాక్ అవుతున్నారు.. ఏది ఏమైనా ఈ నెక్లేస్ మాత్రం చాలా బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ఇటీవల తన కూతురు కోసం ఖరీదైన బంగ్లాను కూడా కట్టించారు.. దాని ధర 250 కోట్లకు పైగా ఉంటుంది..