Leading News Portal in Telugu

Mrunal Thakur: తెలుగు ప్రేక్షకులకు మృణాల్ ఠాకూర్ సాష్టాంగ నమస్కారం



Mrunal Thakur Speech

Mrunal Thakur Speech at Family Star Pre Release Event: విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ స్టార్. తెలుగు సినీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పరశురాం పెట్ల దర్శకత్వంలో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్న ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మృణాల్ ఠాకూర్ వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. స్పీచ్ మొదలుపెట్టే ముందే మీకు చిన్న చిన్న మాటలు చెప్పి మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని నేను వర్ణించలేను అంటూ రెండు కాళ్ళ మీద కింద కూర్చుని సాష్టాంగ నమస్కారం చేసింది. మీ అందరికీ ధన్యవాదాలు, నాకు చాలా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది.

Dil Raju: నన్ను ఆఖరికి దిల్ మామని చేసేసారా

మీరు నన్ను తెలుగమ్మాయిగా యాక్సెప్ట్ చేశారు కాబట్టే ఇక్కడ ఉన్నాను. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. మొదటి 15 రోజులు ఇబ్బంది అనిపించింది కానీ ఆ తర్వాత నేను పోషించిన ఇందు పాత్ర నాకన్నా ఎవరూ బాగా చేయలేరు అనిపించింది. ప్రతి అమ్మాయి విజయ్ తో పని చేయాలి అనుకుంటుంది అలాంటి అవకాశం నాకు దక్కింది. దిల్ రాజు గారితో ఇది రెండో సినిమా, మూడో సినిమా కూడా చేయాలి అని కోరుకుంటున్నా అని అన్నారు. గోపీ సుందర్ ఇచ్చిన మ్యూజిక్ వల్ల నేను చాలా బాగా డాన్స్ చేయగలిగాను అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాను నా ఫ్యామిలీ స్టార్ మా నాన్నకి డెడికేట్ చేస్తున్నాను అని అన్నారు. ఆ తర్వాత స్టూడెంట్స్ అందరినీ సినిమాకు వెళ్లాలని మాట తీసుకుంది మృణాల్.