
Malayalam Actor Chandu Says I Love You to Geetha Bhagath: తెలుగు యాంకర్ గీతా భగత్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలా కాలం నుంచి సినీ పరిశ్రమకు చెందిన ఎన్నో ఈవెంట్లలో ఆమె యాంకరింగ్ చేస్తూ వస్తోంది. ఈ మధ్యకాలంలో కొత్త యాంకర్ల ఎంట్రీతో కాస్త వెనకబడినట్లు కనిపిస్తున్నా మళ్లీ ఆమె బాగానే ఆక్టివ్ అవుతుంది. ప్రస్తుతానికి ఆమె చేతినిండా ఈవెంట్లతో బిజీబిజీగా గడిపేస్తోంది. తాజాగా ఆమె మంజుమ్మల్ బాయ్స్ సినిమాకి సంబంధించిన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హోస్ట్ గా వ్యవహరించింది. ఈ ఈవెంట్ కి మలయాళ మంజుమ్మల్ బాయ్స్ టీమ్ లోని కొంతమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మలయాళ నటుల చేత తెలుగు మాట్లాడించే ప్రయత్నం చేసింది. వారిలో కొందరు మాట్లాడే ప్రయత్నం చేసి నవ్వులు పూయించారు.
Divorce: షాకింగ్: విడాకులు తీసుకున్న పవన్ ‘బ్రో’ సినిమాటోగ్రఫర్.. నటికి గుడ్ బై!
మరి కొంత మంది మలయాళం లోనే మాట్లాడి తమ భావాన్ని వ్యక్తీకరించారు. కొంతమంది మాత్రం ఇంగ్లీషులో మాట్లాడి తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపే ప్రయత్నం చేశారు. అయితే అందులో ఒక నటుడు మాత్రం మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన్ని కాస్త కూల్ చేసే ప్రయత్నంలో భాగంగా గీత భగత్ ఆయన దగ్గరికి వెళ్లి మీకు కొన్ని తెలుగు పదాలు నేర్పిస్తానని చెప్పి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని సెంటెన్స్ చెప్పి దాన్ని రిపీట్ చేయమని చెప్పింది. అయితే నటుడు ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టి చెప్పకుండా ఉన్నట్టు కనిపించినా చివరికి ఆమె చెప్పిన సెంటెన్స్ ని రిపీట్ చేశాడు. దానికి గీతా భగత్ ఐ లవ్ యు టూ అని చెప్పడం హాట్ టాపిక్ అయింది. అయితే దర్శకుడు మైక్ అందుకోవడంతో మీరు కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెబుతారా? అంటే దానికి డైరెక్టర్ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ ఆమె షాక్ ఇచ్చాడు.