
Vijay Deverakonda Promotes Bahumukham Movie : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను చాలా గ్రాండ్గా నిర్వహించింది సినిమా యూనిట్. తెలుగు సహా తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని చెన్నై కూడా వెళ్లి ప్రమోట్ చేసి వచ్చారు. విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం డైరెక్ట్ చేశాడు. దిల్ రాజు- శిరీష్ ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. అయితే ప్రమోషన్స్ లో ఒక ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది.
Geetha Bhagath: తెలుగు యాంకర్ కి స్టేజ్ మీదే ఐలవ్యూ చెప్పిన మలయాళ నటుడు
విజయ్ దేవరకొండ సినిమాని ప్రమోట్ చేస్తున్న సమయంలోనే మరో సినిమా యూనిట్ కూడా ఆయనకు ఎదురయింది. ఆ సినిమా పేరు బహుముఖం. హర్షివ్ కార్తీక్ అనే ఒక ఎన్నారై సినిమా మీద ఫ్యాషన్ తో సినిమాలో ఉన్నాయి 24 క్రాఫ్ట్స్ లో 15 విభాగాలు ఆయనే మేనేజ్ చేసి ఆ సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమా కూడా చిన్న సినిమాగా ఏప్రిల్ 5వ తేదీనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ వెంటనే మా ఫ్యామిలీ స్టార్ సినిమాతో పాటు ఈ బహుముఖం సినిమా కూడా చూడండి. హీరో ఎంతో కష్టపడుతూ ప్రమోషన్స్ చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో చూసిన విజయ్ దేవరకొండ అభిమానులు మా కొండన్న నిజంగానే బంగారు కొండ లేకపోతే అదే రోజు సినిమా రిలీజ్ అవుతుంటే వేరే సినిమా కూడా చూడమని ఏ హీరో అయినా చెబుతాడా అంటూ ప్రశ్నిస్తున్నారు.