
Nayanthara Childhood Picture with Her Father Goes Viral: నయనతార తన తండ్రి కురియన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే నయనతార తన చిన్న వయస్సులో తన తండ్రి ఎత్తుకుని ఉన్న పిక్ షేర్ చేసింది. “నా హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు, మై ఫరెవర్ లవ్, ఐ లవ్యూ అచ్చా(నాన్న) అని అంటూ నయనతార పిక్ తో క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇక నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ అలాగే వారి పిల్లలు కురియన్ పుట్టినరోజును జరుపుకోవడానికి కొచ్చి చేరుకున్నారు. ఉయిర్, ఉలక తమ తాత కోసం మూడు ప్రత్యేక పుట్టినరోజు కేక్‌లతో వచ్చారని చెబుతున్నారు. చిన్నారులు తమ వేళ్లతో కేకులను పొడుస్తున్న వీడియోను విఘ్నేష్ శివన్ షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే డాడ్, మిస్టర్ కురియన్’ అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశాడు విఘ్నేష్. మూడేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి నయనతార చెప్పిన మాటలు వైరల్‌గా మారాయి.
Boney Kapoor: శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి అర్జున్ తల్లిని వదిలేశా.. కానీ ఆమె బంగారం!
‘‘నేను మా నాన్న, అమ్మ, కుటుంబం, ఎప్పుడూ మాట్లాడలేదు, నేను కుటుంబం – పని రెండింటినీ వేరుగా ఉంచడానికి ఇష్టపడే వ్యక్తినని చెప్పుకొచ్చింది. మా నాన్నను ఎప్పుడూ హీరోగానే చూశా, ఈ రోజు నా జీవితంలో ఒక ఆర్డర్ ఉంటే, పని చేయాలనే కోరిక ఉంటే, సమయపాలన ఉంటే, ప్రతిదీ మా నాన్న నుండి వారసత్వంగా వచ్చిందని అన్నారు. పని పరంగానే కాదు, నన్ను నేనుగా మార్చుకోవడంలో కూడా ఆయన నుంచే నేర్చుకున్నా అని ఆమె అన్నారు. నాన్న పనిలో ప్రభావవంతంగా ఉంటాడు, నేను ఎప్పుడూ మా నాన్నను చాలా పర్ఫెక్ట్‌గా చూశాను. అంతరాయం లేకుండా యూనిఫారంలో పని చేయడానికి మా నాన్నగారు వెళ్లి రావడం నాకు గుర్తుంది, అతని గురించి మంచి విషయాలు మాత్రమే విన్నాను అని ఆమె చెప్పుకొచ్చారు.