Leading News Portal in Telugu

Boney Kapoor: శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి అర్జున్ తల్లిని వదిలేశా.. కానీ ఆమె బంగారం!



Arjun Kapoor Mother Boney Kapoor

Boney Kapoor Says He Understood Arjun Kapoor’s Anger After Marriage With Sridevi: ఒకప్పుడు బోనీకపూర్ బాలీవుడ్‌లో నంబర్ వన్ నిర్మాత. దివంగత నటి శ్రీదేవితో అతని ప్రేమ, వివాహం ఒకప్పుడు ఎంతో సంచలననం కలిగించిన అంశాలు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీదేవి మరణంతో కుంగిపోయిన బోనీకపూర్ కనీసం ఒక్క ఇంటర్వ్యూలో కూడా తన భార్య గురించి మాట్లాడకుండా ఉండలేడు. బోనీ కపూర్ నిర్మించిన కొత్త చిత్రం మైదాన్‌ను ప్రమోట్ చేస్తున్న క్రమంలో శ్రీదేవితో తన వివాహం గురించి , తన మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ కోపం గురించి మాట్లాడారు. బోనీ కపూర్ 1983లో మోనా శౌరీని వివాహం చేసుకున్నారు. ఈ జంట పదమూడు సంవత్సరాలు కలిసి జీవించారు. ఆ క్రమంలోనే వారి ప్రేమకు గుర్తుగా పుట్టిన పిల్లలు అర్జున్ కపూర్, అన్షులా కపూర్. అయితే 1996లో బోనీకపూర్ శ్రీదేవిని పెళ్లాడేందుకు మోనా శౌరీని విడిచిపెట్టారు. అయితే తన ఈ నిర్ణయం తన కొడుకు అర్జున్ కపూర్ భావోద్వేగాలను బాగా ప్రభావితం చేసిందని బోనీ కపూర్ చెప్పారు.

Film Chamber: హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో అగ్నిప్రమాదం

తన కొడుకు చాలా సంవత్సరాలుగా తనపై కోపంగా ఉన్నాడని కూడా బోనీ కపూర్ వెల్లడించాడు. నేను అతని భావోద్వేగాలను అర్థం చేసుకోగలను, అవి ఎందుకు, ఎక్కడ నుండి వస్తున్నాయో తెలుసుకోగలనని అనాన్రు. చాలా కాలంగా నేను దాని గురించి గిల్టీగా భావించాను. కానీ నాకు చాలా నిజాయితీగా సపోర్ట్ చేసింది మోనా శౌరీ. శ్రీదేవి పట్ల నాకున్న ఫీలింగ్స్‌ని మోనా ఒక్కరే అర్థం చేసుకుంటారని బోనీకపూర్ అన్నారు. మోనాకి శ్రీతో మంచి స్నేహం ఉండేది, మా పెళ్లికి ముందు, శ్రీదేవిని ఆమె ఇంటికి పిలిచేది, శ్రీదేవి మా ఇంట్లోనే ఉండేది. మా అమ్మ కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుందని అన్నారు. శ్రీదేవిని నా చేతికి రాఖీ కట్టమని ఒకసారి అడిగానని బోనీకపూర్ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఐదేళ్లలోపే పెళ్లి జరిగిందని అన్నారు. ఇక శ్రీదేవి 2018లో మరణించారు. ఆ మరణం గురించి ఇంకా మాట్లాడలేనని బోనీ చెప్పారు. ఆమె లేకుండా ఎలా జీవించాలో నాకు తెలియదు అని బోనీ కపూర్ అన్నారు.