Leading News Portal in Telugu

Tillu Square OTT: ఓటీటీలోకి టిల్లుగాడు వచ్చేది ఎప్పుడంటే?



Tilluuuuu

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘టిల్లు స్క్వేర్ ‘.. మార్చి 29 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతుంది.. ఆరు రోజుల్లోనే 91 కోట్ల కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.. రెండు మూడు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.. గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చింది.. ఇక ఈ సినిమా ఓటీటీలోకి త్వరలోనే రాబోతుంది..

సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్‌, అనుపమతో అతడి కెమిస్ట్రీ అభిమానులతో ఆకట్టుకుంటోన్నాయి. ఇప్పటివరకు తెలుగులో చాలా పద్దతిగా సాఫ్ట్ రోల్ చేస్తూ వచ్చిన అనుపమ ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించింది. సిద్దు పంచ్ డైలాగులు, కామెడీ టైమింగ్ హిలేరియస్‌గా థియేటర్లలో నవ్విస్తున్నాయి.. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు.. ఇక నేహా శెట్టి టిల్లు స్క్వేర్‌లో గెస్ట్ రోల్‌లో కనిపించింది. టిల్లు ఫ్రాంచైజ్‌లో భాగంగా మూడో పార్ట్ కూడా రాబోతోంది.. ఆ సినిమాకు టిల్లు క్యూబ్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.. ఆ సినిమాలో సూపర్ హీరోగా సిద్దు కనిపించబోతున్నారని సమాచారం..

ఇక ఈ సినిమా నెలలోపే ఓటీటీలోకి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. రిలీజ్‌కు ముందే టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. ఫ్యానీ రేటుకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఏప్రిల్ 26 నుంచి టిల్లు స్క్వేర్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ప్రస్తుతం సినిమా కలెక్షన్స్ కూడా పెరుగుతుండటంతో ఈ డేట్ మారే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.. మరి ఎప్పుడు ఓటీటిలోకి వస్తుందో తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చెయ్యాలి..