
Targeted Campain Against Vijay’s Family Star started: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ఇప్పటివరకు అమెరికా సహా ఏ దేశంలోనూ ప్రదర్శించబడలేదు. ఈరోజు భారత కాలమానం ప్రకారం 9 గంటల తర్వాత అమెరికాలో షోస్ పడే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి సినిమా ఎలా ఉంది? అనే టాక్ బయటకు వచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం 8 గంటలకు ఐమాక్స్ లో షో పడుతుంది. అంతకన్నా ముందే శ్రీ రాములు థియేటర్లో 7:30 కు ఒక షో వేస్తున్నారు. ఈ షో కి ఈ సినిమా యూనిట్ హాజరయ్యే అవకాశం ఉంది. అంటే హైదరాబాదులో టాక్ బయటకు రావాలంటే మినిమం పదిన్నర 11 గంటల వరకు కుదరని పని. అయితే సినిమా ఇంకా రిలీజ్ కూడా అవకుండానే యూట్యూబ్ లో అప్పుడే రివ్యూలు వచ్చేసాయి.
Meera Jasmine: తీవ్ర విషాదంలో మీరా జాస్మిన్
సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది అని అర్థం వచ్చేలా అప్పుడే కావాలని రివ్యూస్ పోస్ట్ చేస్తున్నారు అని మీరు దేవరకొండ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఎక్కువగా యూట్యూబ్ లోనే ఇలాంటి వీడియోస్ వస్తున్నాయని ఫ్యామిలీ స్టార్ రివ్యూ, ఫ్యామిలీ స్టార్ యూఎస్ఏ టాక్ అంటూ నెగిటివ్ థంబ్ నెయిల్స్ రావడం చూస్తుంటే ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నట్లు అనిపిస్తోందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఫ్యామిలీ స్టార్ సినిమాకి విజయ్ గత సినిమాలతో పోలిస్తే బజ్ తక్కువగానే ఉంది. అయితే ప్రస్తుతానికి వేసవి సెలవు కావడం సినిమాకి బాగా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. చూడాలి మరి పరశురాం ఎలాంటి మ్యాజిక్ చేసి గీతగోవిందం సినిమా రికార్డులను రిపీట్ చేస్తాడు అనేది